E-Paper
Advertisement

ఇడుపు కాయితం ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథులుగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి?

ఇడుపు కాయితం ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథులుగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి?
Advertisement

Idupu Kayitham Pre Release: వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి(Priyadarshi), నాగ దుర్గ(Naga Durga) హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham)బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా డిసెంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. తాజాగా చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి అధికారక ప్రకటన వెల్లడించారు. ఈ సినిమా డిసెంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా మొదలు పెట్టబోతున్నారు.

దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు..

ఇక ఈ సినిమాకు బన్నీ వాసు(Bunny Vasu) నిర్మాతగా వ్యవహరించిన నేపథ్యంలో డైరెక్టర్ వంశీ రెడ్డి(Vamsi Reddy) ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా బన్నీ వాసుతో మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మా చెల్లెలు స్నేహ రెడ్డి (Sneha Reddy)అలాగే బావగారు అల్లు అర్జున్(Allu Arjun) ను ముఖ్య అతిథులుగా తీసుకురావాలని కోరారు. ఇలా వంశి రెడ్డి చెప్పగానే బన్నీ వాసు ఒక్కసారిగా షాక్ అవ్వుతూ.. ఇలాంటి విషయాలకు తాను కమిట్మెంట్ ఇవ్వలేనని, మీకు కావాలి అంటే ఇంకా 20 రోజులు షూటింగ్ అదనంగా చేసుకోండి కానీ ఇలాంటివి మాత్రం దయచేసి నన్ను అడగద్దు అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు.

స్నేహ రెడ్డి ఫోన్ ఆఫ్ చేసి పెట్టేస్తారు..

Advertisement

అల్లు అర్జున్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా రావడం అసలు జరగని పని అని తెలిపారు. ఇక బావగారు రాకపోయినా మా చెల్లెలు అల్లు స్నేహ రెడ్డి గారినైనా తీసుకురండి అంటూ వంశి రెడ్డి చెప్పడంతో వెంటనే బన్నీ వాసు స్పందిస్తూ స్నేహ రెడ్డి గారు ఈ మాట విన్నారంటే ఇప్పుడే తన ఫోన్ ఆఫ్ చేసి పెట్టేస్తారని సమాధానం ఇచ్చారు. ఇలా ఈ సినిమా వేడుకకు అల్లు అర్జున్, స్నేహ రెడ్డి రావడం జరగని పని అని ఈయన క్లారిటీ ఇచ్చారు. స్నేహ రెడ్డి ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాకపోవడంతో సినిమా వేడుకలకు పూర్తిగా దూరంగా ఉంటారు.

ఫోక్ డాన్సర్ గా నాగదుర్గ గుర్తింపు..

ఈమె అల్లు అర్జున్ సినిమా వేడుకలకు కూడా హాజరుకారు. ఇక అల్లు అర్జున్ మాత్రం ప్రస్తుతం రాక సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. కెరియర్ పరంగా బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఏ సినిమా ఈవెంట్లకు గెస్ట్ గా హాజరుకారనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇడుపు కాయితం సినిమా విషయానికి వస్తే ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రియదర్శి హీరోగా నటించగా తెలంగాణ ఫోక్ సాంగ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగదుర్గ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

Advertisement

Also Read: ఒక వైపు ట్రోలింగ్.. మరోవైపు రికార్డులు ఓటీటీలో ‘ది ప్యారడైజ్’ సంచలనం!

Related News

ఆ హీరో నా లక్కీచార్మ్.. సమంత కామెంట్స్ వైరల్!

ఈమెని వదిలితే ఇన్‌స్టా తగలబడిపోద్ది..నాగదుర్గపై బన్నీ వాస్ సెటైర్లు !

‘గరివిడి లక్ష్మి’ సినిమాని ఇంత మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారా?

వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ రన్ టైం లాక్.. కీలక సన్నివేశాలు డిలీట్ చేసిన గురూజీ!

ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మారుతి.. వార్నింగ్లు ఇస్తున్న ఫ్యాన్స్

ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

రాజకీయాల వల్ల కోట్లు పోగొట్టుకున్న నటుడు?

Big Stories

Advertisement
×