BigTV English

Hyderabad Pubs: హైదరాబాద్ పబ్‌లపై టాస్క్ ఫోర్స్ కొరడా.. ఆఫ్టర్ 9 పబ్ లో రైడ్స్!

Hyderabad Pubs: హైదరాబాద్ పబ్‌లపై టాస్క్ ఫోర్స్ కొరడా.. ఆఫ్టర్ 9 పబ్ లో రైడ్స్!

Taskforce Attack on After9 Pubs: హైదరాబాద్ లో పబ్ లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మరోసారి కొరడా ఝుళిపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తోన్న పబ్ లపై దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్ లోని ఆఫ్టర్ 9 పబ్ లో రైడ్స్ చేశారు. ఆఫ్టర్ 9 పబ్ లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి అసభ్యకర డ్యాన్సులు చేయిస్తున్నారు.


ఈ క్రమంలో యువతీ యువకులు మద్యం మత్తులో హల్ చల్ చేశారు. పబ్ పై దాడులు నిర్వహించిన పోలీసులు.. పలువురు యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై, పబ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పబ్ పై దాడుల సమయంలో అక్కడ సుమారుగా 100-150 మంది యువతీ యువకులు ఉన్నట్లు తెలుస్తోంది.

మద్యంమత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న 32 మంది యువతులు, 75 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ కు వచ్చేవారిని ఆకర్షించేందుకు కర్ణాటకలోని గుల్బర్గా నుంచి వీరిని పిలిపించినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్నవారికి డ్రగ్స్ డిటెక్స్ టెస్ట్ చేస్తున్నారు పోలీసులు. 35 మంది యువతుల్ని సైదాబాద్ లోని రెస్క్యూహోమ్ కు తరలించారు.


Also Read : కేసీఆర్‌కు మరో షాక్.. స్పీడ్ పోస్ట్ ద్వారా తెలంగాణ భవన్‌కు..

కాగా.. ఈ ఏడాది ఆరంభంలోనే పోలీసులు పబ్ లపై ఉక్కుపాదం మోపారు. న్యూ ఇయర్ రోజునే జూబ్లీహిల్స్ లో 6 పబ్బులపై కేసులు నమోదు చేశారు. హలో, టార్, గ్రీన్ మంకీస్, మకవ్, లాస్ట్, జీనా పబ్బులపై కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకలకు పర్మిషన్ తీసుకోకపోవడం, పబ్ ల నుంచి శబ్దాలు ఎక్కువగా వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో.. ఐపీసీ సెక్షన్ 188, 290, సీపీ చట్టాల కింద కేసు నమోదు చేశారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×