Big Stories

PBKS Vs CSK Preview IPL 2024: పంజాబ్ కింగ్స్ ఈసారి ఏం చేస్తుంది..? నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో పోటీ

IPL 2024 53rd Match – Punjab Kings Vs Chennai Super Kings Preview: ఊహించని చిత్రాలన్నీ ఐపీఎల్ లో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. అట్టడుగు స్థానానికి అటూ ఇటుగా ఉన్న పంజాబ్ కింగ్స్ ఒక్కసారిగా గేర్ మార్చి అలవోకగా విజయాలు సాధిస్తోంది. మొదట్లో కొంచెం బాగా ఆడి, తర్వాత ఒడిదుడుకుల మధ్య చెన్నై సాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు ధర్మశాలలో మధ్యాహ్నం 3.30కి చెన్నయ్ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

- Advertisement -

ప్రస్తుతం ఐపీఎల్ లో  చెన్నై 10 మ్యాచ్ లు ఆడి 5 గెలిచి, 5 ఓడిపోయింది. మొత్తానికి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇక పంజాబ్ 10 మ్యాచ్ లు ఆడి 4 గెలిచి 8 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇంతవరకు 29 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ 14 గెలిస్తే, చెన్నయ్ 15 విజయం సాధించింది.

- Advertisement -

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమయ్యాక పంజాబ్ కింగ్స్ పని అయిపోయింది రా.. అని అంతా అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి విజృంభిస్తోంది. 261 లక్ష్యాన్ని కూడా ఉఫ్ మని ఊది పారేసింది. అలాంటి జట్టు ప్రస్తుతం పటిష్టంగా కనిపిస్తున్న చెన్నై పై ఆడనుంది.

Also Read: ఆర్సీబీ జైత్రయాత్ర.. గుజరాత్ పై ఘన విజయం

పంజాబ్ లో ప్రభుశిమ్రాన్ సింగ్, జానీ బెయిర్ స్టో, రిలీ రసోవ్, శశాంక్ సింగ్ అందరూ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చారు. అదరగొడుతున్నారు. బౌలింగులో కూడా కెప్టెన్ శామ్ కర్రాన్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, రబాడ వీళ్లందరూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు.

చెన్నై విషయానికి వస్తే ఆజ్యింక రహానె పెద్ద స్కోరు బాకీ ఉన్నాడు. ఎంతసేపు రుతురాజ్ గైక్వాడ్ పైనే భారం పడుతోంది. తను మాత్రం ఎన్ని మ్యాచ్ లని నిలబడి ఆడతాడని సీనియర్లు అంటున్నారు. శివమ్ దుబె, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వి వీళ్లు ఆడినప్పుడు మ్యాచ్ లు గెలుస్తున్నారు. లేదంటే ఓటమి బాట పడుతున్నారు.

బౌలింగు వనరులు కూడా బాగున్నాయి.  శార్దూల్ ఠాకూర్, రిచర్డ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రవీంద్ర జడేజా, మొయిన్ ఆలీ, దీపక్ చాహర్ వీరందరూ బాగా బౌలింగు చేస్తున్నారు. సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎలా జరుగుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News