BigTV English

Rapolu Anand Bhaskar Resigns to BRS: కేసీఆర్‌కు మరో షాక్.. స్పీడ్ పోస్ట్ ద్వారా తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ కండువా..!

Rapolu Anand Bhaskar Resigns to BRS: కేసీఆర్‌కు మరో షాక్.. స్పీడ్ పోస్ట్ ద్వారా తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ కండువా..!

Rapolu Anand Bhaskar Resigns to BRS Party: అసెంబ్లీ ఎన్నికల మొదలు కేసీఆర్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా కూడా కేసీఆర్‌కు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు.


రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత రాపోలు ఆనంద భాస్కర్ తో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు తీగల లక్ష్మణ్ గౌడ పార్టీకి రాజీనామా చేశారు. వారి రాజీనామా లేఖలను కేసీఆర్ కు పంపించారు.

Rapolu Anand Bhasker
Rapolu Anand Bhasker

Also Read: CM Revanth Reddy: కేటీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు: సీఎం రేవంత్ రెడ్డి


‘విధిలేని పరిస్థితిలో కీలక నిర్ణయం తీసుకున్నా. కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్ధం కాని పరిస్థితిలో నా లాంటి నేతలు ఉన్నారు. 2022లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరా.
ప్రాంతీయ ఉద్యమ పార్టీ నుంచి ఇక నా అనుబంధాన్ని తెంచుకుంటున్నాను. నేను బీఆర్ఎస్ లో చేరినప్పుడు కేసీఆర్ ఇచ్చిన బీఆర్ఎస్ కండువాను హైదరాబాద్ తెలంగాణ భవన్ కి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాను.

తెలంగాణ సబ్బండ వర్గాల కోసం పోరాడేలా నా భవిష్యత్తు కార్యచరణ ఉంటుంది. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతుంది. తెలంగాణ భౌగోళిక స్వరూపం ప్రగతి పరిరక్షణ కోసం ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తా. కుల జన గణన అంశం ఉద్యమాల్లో నా పాత్ర ఉంటుంది. కేసీఆర్ గణాంకాల కోసం సకల జనుల సర్వే మాత్రమే చేశారు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తుంది..కుల జన గణన దిశగా అడుగులు వేస్తుంది.

Also Read: కారు కార్ఖానాకు పోయింది.. ఇక తూకం కింద అమ్ముకోవాల్సిందే: సీఎం రేవంత్

నేను ఉద్యమాల వెంట ఉండే వ్యక్తిని. తెలంగాణ అభివృద్ధి కొందరికి కంటగింపుగా ఉంది. తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నారు. నేను ఎవరిపైనా విమర్శలు చేయను.. నాకున్న సమాచారం మేరకు ప్రజలను జాగరుకం చేస్తున్నాను. హైదరాబాద్ అంశాన్ని రేవంత్ రెడ్డి, కేసీఆర్ అందరి దృష్టికి తీసుకువెళతా. ఏ పార్టీలోకి వెళతా అనేది చెప్పలేను.. ప్రజా ఉద్యమాల్లో ఉంటా’ అని రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×