E-Paper
Advertisement

Telangana Govt: తెలంగాణలో మహిళలకు శుభవార్త.. ఉచితంగా కుట్టు మిషన్లు

Telangana Govt: తెలంగాణలో మహిళలకు శుభవార్త.. ఉచితంగా కుట్టు మిషన్లు
Advertisement

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బలహీన వర్గాల మహిళల ఆర్థిక ఎదుగుదలకు మరొక పథకాన్ని ప్రకటించింది. మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. దీనికి సంబంధించి త్వరలో దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభంకానుంది.

మహిళలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Advertisement

తెలంగాణలోని వెనుకబడిన తరగతుల మహిళల అభివృద్ధి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహించే దిశగా ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మహిళా సాధికారత లక్ష్యంగా ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ చేయబోతోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,000 మందికి చొప్పున కుట్టు మిషన్లను కేటాయించింది.

రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనుంది. ఈ పనిలో నైపుణ్యం కలిగి ఉండి సరైన యంత్రాలు లేక ఇబ్బంది పడుతున్న బీసీ మహిళలకు మొదటి ప్రాధాన్యం కల్పించనుంది. రెడీమేడ్ దుస్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆటోమేటిక్ కుట్టు మిషన్ల ద్వారా వారికి ఉపాధి లభిస్తుందని భావిస్తోంది.

Advertisement

బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ

సాధారణ మిషన్లతో పోలిస్తే ఆటోమేటిక్ కుట్టు మిషన్ల ద్వారా ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. నిరుపేద మహిళలు దర్జీలుగా మారి కుటుంబాన్ని సొంతంగా పోషించుకోగలరని భావిస్తోంది. ఈ మేరకు మంత్రి పొన్న ప్రభాకర్ ప్రకటన చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

దీనిద్వారా వేలాది మంది మహిళలు స్వయం ఉపాధిని పొంది ఆర్థికంగా స్థిరపడే అవకాశం లభించనుంది. ఈ పథకం అమలు కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సదరు మంత్రి తెలిపారు. అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే ఎంపిక ప్రక్రియ జిల్లా కలెక్టర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగనుంది.

ALSO READ: ఏపీ టు తెలంగాణ..కాంగ్రెస్‌లో పదవుల పండగ..!

దీనికి సంబంధించి అర్హతలు, వయస్సు, దరఖాస్తు చేసుకోవాల్సిన విధానంపై త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనుంది ప్రభుత్వం. మరొక విషయం ఏంటంటే దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన వారై ఉండాలి. అలాగే వార్షిక ఆదాయ పరిమితి వంటి నిబంధనలు ఉండాలి.

ఈ పథకాన్ని కేవలం కుట్టు మిషన్ల పంపిణీగా చూడటం లేదన్నారు సదరు మంత్రి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వివిధ వృత్తుల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళలకు అవసరమైతే ఆధునిక డిజైనింగ్, కుట్టు పనిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×