E-Paper
Advertisement

తెలంగాణ ఇంటర్ ఫలితాలు-2026.. ఆ రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం, విద్యార్థుల్లో కొత్త టెన్షన్

తెలంగాణ ఇంటర్ ఫలితాలు-2026.. ఆ రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం, విద్యార్థుల్లో కొత్త టెన్షన్
Advertisement

Telangana Inter Results-2026: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయి? షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ సెకండ్ వీక్‌లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశమున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ డిలే అవుతున్నట్లు సాగింది. తాజాగా తెలంగాణ ఇంటర్ ఫలితాలు-2026 గురించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు-2026 గురించి కీలక అప్‌డేట్స్

Advertisement

తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు కీలక కబురు. ఇంటర్ ఫస్టయిర్, సెకండ్ విద్యార్థులకు ఇదొక కీలక సమాచారం. ఇంటర్ ఫలితాలను శుక్రవారం లేదా శనివారంలో విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అంతా రెడీ అయ్యింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే దీనికి ఆలస్యం.

ఈ ఏడాది ఫిబ్రవరి మూడోవారం నుంచి ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 9,97,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో ఇంటర్ ఫస్టయిర్ విద్యార్థులు 4,89,126 మంది ఉన్నారు. సెకండియర్ విద్యార్థులు సుమారు 5,08,000 మంది ఉన్నారు. ఇప్పటికే అన్ని ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు అధికారులు.

Advertisement

ఏప్రిల్ 10 లేదా 11న ఫలితాలు ఇంటర్ వెల్లడయ్యే అవకాశం

కొంతమంది విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులలో 2 లేదా 3 మార్కుల తేడాతో ఫెయిల్ అయినట్లు అంతర్గత సమాచారం. ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై చర్చలు జరిగాయి. దీనిపై ప్రభుత్వం నుంచి దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10 లేదా 11 ఫలితాలు వెల్లడికానున్నాయి.  ఈ విషయం తెలియగానే విద్యార్థుల్లో సందడి మొదలైంది. వేసవి సెలవులకు ముందే ఫలితాలు రానుండడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సెలవుల్లో హ్యాపీగా గడప వచ్చని అంటున్నారు. ఒకవేళ ఫెయిల్ అయినవారికి చదువుకునే అవకాశం దక్కనుంది.

ALSO READ: ఎమ్మెల్యేనే మోసం చేసిన కేటుగాళ్లు.. రూ.10 లక్షల ఆశ చూపి లక్ష నొక్కేసిన కేటుగాడు!

ఇంటర్ బోర్డు అధికారిక పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. తొలుత ఫలితాలు వెల్లడి తర్వాత విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. లాగిన్ అవ్వడానికి హాల్ టిక్కెట్లపై రోల్ నెంబర్ అవసరం కావడంతో విద్యార్థులు దాన్ని అందుబాటులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×