E-Paper
Advertisement

మ్యాచ్ మ‌ధ్య‌లో గొడ‌వ‌.. ర‌షీద్ ఖాన్ ను కొట్టేందుకు దూసుకెళ్లిన‌ నితీష్ రాణా

మ్యాచ్ మ‌ధ్య‌లో గొడ‌వ‌.. ర‌షీద్ ఖాన్ ను కొట్టేందుకు దూసుకెళ్లిన‌ నితీష్ రాణా
Advertisement

Rashid Khan-Nitish Rana:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) రోజుకో సంఘటన వివాదంగా మారుతుంది. ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక అంశం హాట్ టాపిక్ అవుతోంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, అంపైర్ల తప్పుడు నిర్ణయాలు, ప్లేయర్ల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. అయితే లేటెస్ట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Delhi Capitals vs Gujarat Titans) మధ్య మ్యాచ్ జరగగా, ఇందులో రషీద్ ఖాన్ ( Rashid Khan), నితీష్ రాణా ( Nitish Rana ) మధ్య వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలోనే ఒకరినొక‌రు కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నితీష్ రాణా క్రికెట్ తీసిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు…వాడి ఏజ్ ఒక్క‌టే కాదు, బ్యాట్లు కూడా చెక్ చేయాల్సిందే

ర‌షీద్ ఖాన్ ను కొట్టేందుకు దూసుకెళ్లిన‌ నితీష్ రాణా

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బుధవారం రోజున ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య 14వ మ్యాచ్ జరిగింది. ఇందులో ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్. అయితే ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్, నితీష్ రాణా మధ్య గొడవ జరిగింది. నితీష్ రాణా బ్యాటింగుకు రాగానే 5 పరుగులు సాధించాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్ లో నితీష్ రాణా సాయి సుదర్శన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే వికెట్ పడిన తర్వాత నితీష్ రాణాను ఉద్దేశించి బూతులు తిట్టాడు రషీద్ ఖాన్.

దీంతో వెంటనే రియాక్ట్ అయిన నితీష్ రాణా అతన్నీ కొట్టేందుకు ముందుకు వచ్చాడు. దీంతో ఇద్దరు మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. అంతలోనే గుజరాత్ టైటాన్స్ ఇతర ప్లేయర్లు రంగంలోకి దిగి గొడవలు సద్దుమనిగేలా చేశారు. దీనికి సంబంధించిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇందులో రషీద్ ఖాన్ తప్పు ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. వికెట్ తీశాక ఓవరాక్షన్ చేయకుండా ఉంటే బాగుండేదని కౌంటర్ ఇస్తున్నారు. ఇక అటు ఇదే మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ చివరలో సింగిల్ తీయకుండా, ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచాడు. సులభంగా సింగిల్ తీసుకొని మ్యాచ్ డ్రా చేసినా సరిపోయేది. ఈ రెండు పనులు చేయకుండా ఢిల్లీని చేజేతులా ఓడిపోయేలా చేశాడు. దీంతో డేవిడ్ మిల్లర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ చోటుచేసుకుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ పై వేటు వేసింది బిసిసిఐ. ఈ క్రమంలో గిల్ పైన దాదాపు 12 లక్షల ఫైన్ వేస్తున్నట్లు ప్రకటన చేశారు.

Advertisement

 

Also Read: Virender Sehwag: రాసిపెట్టుకోండి…బుమ్రా బౌలింగ్ లో వైభ‌వ్ 6 బంతుల్లో ఆరు సిక్స‌రు కొడ‌తాడు

 

 

https://www.instagram.com/reels/DW4VDGoklKH/

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×