E-Paper
Advertisement

రోజంతా ఉత్సాహంగా ఉండాలా? అయితే మహిళలు ఈ మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వాల్సిందే!

రోజంతా ఉత్సాహంగా ఉండాలా? అయితే మహిళలు ఈ మార్నింగ్ రొటీన్ ఫాలో అవ్వాల్సిందే!
Advertisement

Women health: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. ఇంటి బాధ్యతలు, ఆఫీసు పనుల మధ్య మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటారు. ఒక క్రమబద్ధమైన ఉదయపు అలవాటు శారీరక శక్తిని ఇవ్వడమే కాకుండా.. రోజంతా మానసిక ప్రశాంతతను అందిస్తుంది. సరైన సమయంలో నిద్ర లేవడం నుంచి పోషకాహారం వరకు కొన్ని మార్పులు చేసుకుంటే.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. ఆ అద్భుతమైన 4 అలవాట్లు ఇవే..

మహిళల ఆరోగ్యం కోసం 4 బెస్ట్ మార్నింగ్ రొటీన్స్:

Advertisement

1. గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించండి:
నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ.. ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యలు రావచ్చు. దానికి బదులుగా ఒకటి లేదా రెండు గ్లాసుల గోరు వెచ్చని నీటిని తాగాలి.

ప్రయోజనం: ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.

Advertisement

చిట్కా: నీటిలో కొంచెం నిమ్మరసం లేదా తేనె కలుపుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అంతే కాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది.

2. శరీరానికి కాస్త వ్యాయామం, సూర్యరశ్మి:
మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం ఈ రోజుల్లో సర్వసాధారణం. దీనిని అదుపులో ఉంచుకోవడానికి రోజుకు కనీసం 20-30 నిమిషాల వ్యాయామం తప్పనిసరి.

యోగా లేదా వాకింగ్ : సూర్యోదయ సమయంలో కాసేపు నడవడం వల్ల శరీరానికి ‘విటమిన్ డి’ అందుతుంది. ఇది ఎముకల పుష్టికి చాలా అవసరం.

ప్రాణాయామం: ఒత్తిడిని తగ్గించుకోవడానికి 5 నిమిషాల ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు అద్భుతంగా పనిచేస్తాయి.

3. పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ :
చాలా మంది మహిళలు పనుల హడావిడిలో బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. ఇది మెటబాలిజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఏం తినాలి?: ప్రోటీన్లు, ఫైబర్ , ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాన్ని ఎంచుకోండి.

ఉదాహరణ: మొలకెత్తిన గింజలు, ఓట్స్, ఇడ్లీ లేదా గుడ్లు.

బ్రేక్ ఫాస్ట్: అల్పాహారం అనేది మీ శరీరానికి రోజంతా అవసరమైన ఇంధనాన్ని ఇస్తుంది. కాబట్టి దీనిని ఎప్పుడూ స్కిప్ చేయకండి.

Also Read: కెమికల్స్ లేని మేకప్ రిమూవల్.. వంటింట్లో దొరికే ఈ 3 పదార్థాలతో మెరిసే చర్మం

4. స్వీయ సంరక్షణ, ప్రణాళిక:
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే.. రోజంతా చేయాల్సిన పనుల గురించి ఒక చిన్న ‘To-Do List’ రాసుకోవడం వల్ల గందరగోళం తగ్గుతుంది.

స్క్రీన్ టైమ్ తగ్గించండి: నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ చూడటం మానేయండి. దీని వల్ల అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది.

పాజిటివ్ థింకింగ్: “ఈ రోజు నేను ఆరోగ్యంగా.. సంతోషంగా ఉంటాను” అనే సానుకూల ఆలోచనతో రోజును మొదలుపెట్టండి.

ఆరోగ్యం అనేది ఒక రోజులో వచ్చేది కాదు.. అది మనం రోజూ పాటించే చిన్న చిన్న అలవాట్ల ఫలితం. పైన పేర్కొన్న నాలుగు సూత్రాలను కనీసం 21 రోజుల పాటు నిరంతరాయంగా పాటించి చూడండి. మీ శక్తి సామర్థ్యాల్లో, మానసిక స్థితిలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఆరోగ్యవంతురాలైన మహిళే.. ఆరోగ్యవంతమైన కుటుంబాన్ని నిర్మించగలదు.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×