E-Paper
Advertisement

Telangana Jagruthi: తెలంగాణ సమగ్రాభివృద్ధికి.. జాగృతి బ్లూప్రింట్ సిద్ధం

Telangana Jagruthi: తెలంగాణ సమగ్రాభివృద్ధికి.. జాగృతి బ్లూప్రింట్ సిద్ధం
Advertisement

Telangana Jagruthi: రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక వికాసానికి, చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణకు, వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోన్న తెలంగాణ జాగృతి రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అడుగులు వేయనున్నది. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం బ్లూ ప్రింట్ రూపొందించడంలో నిమగ్నమయ్యింది.

జాగృతి జనంబాటలో భాగంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తోన్న.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజల నుంచి తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం అవసరమని సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రస్ఫుటింపజేసేలా రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్వీయ రాజకీయ శక్తిగా నిలుస్తామని కవిత స్పష్టం చేశారు.

Advertisement

తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గం మంగళవారం (ఈనెల 6న) సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. ప్రజాస్వామిక పద్ధతిలో అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపజేస్తూ.. కమిటీలు ఏర్పాటు చేసి వాటి నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో జాగృతి ముఖ్య నాయకులు బుధవారం సమావేశమై.. పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం – సంపూర్ణ అధ్యయనం సహా 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని, రాష్టంలోని వివిధ రాజకీయ పార్టీల రాజ్యాంగాలను స్టడీ చేసి జాగృతికి ప్రజాస్వామ్యబద్ధమైన, పటిష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించడానికి న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు.

Advertisement

ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయిమెంట్, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ సాధికారత, కార్మిక, సింగరేణి, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, లిటరేచర్, హిస్టరీ – హెరిటేజ్, ఎంప్లాయీస్, టీచర్స్, మహిళా సాధికారత, శిశు సంక్షేమం, యూత్ ఎంపవర్మెంట్, ఆన్ లైన్ కంటెంట్, ఉద్యమకారుల సంక్షేమం, ఇరిగేషన్, బడ్జెట్ ఎనాలిసిస్, మైనార్టీల సాధికారత, వలస (గల్ఫ్) కార్మికుల సంక్షేమం, స్టూడెంట్స్, రెవెన్యూ రిఫార్మ్స్ విభాగాల్లో విద్యావంతులు, నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేశారు.

ఒక్కో కమిటీలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులను నియమించారు. ప్రతి కమిటీలో విధిగా విద్యావంతులైన మహిళా నాయకులకు అవకాశం ఇచ్చారు. కమిటీల బాధ్యులు రానున్న పది రోజుల పాటు వారికి అప్పగించిన రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తారు. తమ నివేదికలను ఈనెల 17వ తేదీన జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ అధ్యక్షతన నియమించిన స్టీరింగ్ కమిటీకి సమర్పిస్తారు. స్టీరింగ్ కమిటీ నివేదికపై జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గం మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై అందరి అభిప్రాయలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటుంది.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×