Telangana Municipal Election-2026: తెలంగాణలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్ మొదలైంది. బుధవారం ఉదయం ఏడు గంటలకు ముందే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వచ్చిన ఓటర్లు తమతమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మొదలు
బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 52,17,413 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మహిళలు 26,67,025 మంది, పురుషులు 25,49,750 మంది ఉన్నారు. 116 మునిసిపాలిటీల్లో 2996 వార్డులకు 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మక్తల్ లోని 6వ వార్డు ఎన్నిక వాయిదా పడడంతో 2995 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
అధికార కాంగ్రెస్ నుంచి 2,358 మంది, బీఆర్ఎస్ నుంచి 2,478 మంది, బీజేపీ నుంచి 2,252 మంది సహా మొత్తం 10,719 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మున్సిపాలిటీల కోసం 6,017 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 7 కార్పొరేషన్లల్లో 412 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
మహబూబ్‌నగర్, రామగుండం కార్పొరేషన్లలో రెండు వార్డులు ఏకగ్రీవమయ్యారు. కార్పొరేషన్లలో కాంగ్రెస్ నుంచి 410 అభ్యర్థులు, బీఆర్ఎస్ నుంచి 401, బీజేపీ నుంచి 382 మంది సహా మొత్తం 2,225 మంది అభ్యర్థులు తమతమ అదృష్టాలను పరీక్షించుకోనున్నారు. కార్పొరేషన్ల పరిధిలో 2,174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.
పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. అత్యంత సమస్యాత్మకమైన కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ మొదలుకానుంది. ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.
ALSO READ: మీ ఆరోపణలలో అనువంత కూడా నిజం లేదు: డీజీపీ శివధర్ రెడ్డి
ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్న ఓటర్లు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు
Municipal Election polling begins in Telangana at 7 am pic.twitter.com/kUaUC89DtQ
— BIG TV Breaking News (@bigtvtelugu) February 11, 2026