E-Paper
Advertisement

TG Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. ఏ క్షణమైనా షెడ్యూల్!

TG Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. ఏ క్షణమైనా షెడ్యూల్!
Advertisement

TG Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగేందుకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తన కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయిలో ఉన్న ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి కీలక జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు పూర్తయ్యాయి. ఆయా జిల్లాల్లో ఓటర్ల జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ ఏ మేరకు వచ్చిందో ఎన్నికల సంఘం ఆరా తీసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

అంతేకాకుండా ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన బ్యాలెట్ బాక్సుల లభ్యతపై ఎస్ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది. పాత బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతో పాటు, అవసరమైన చోట కొత్త వాటిని సమకూర్చుకోవాలని కలెక్టర్లకు సూచించింది. వీటితో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని గుర్తించి, వారికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించారు. టీ-పోల్ (Te-Poll) సాఫ్ట్‌వేర్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వీలుగా అధికారులకు సాంకేతిక శిక్షణ కూడా ఇస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 26 తర్వాత ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల మేడారంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో పోలింగ్ నిర్వహించేలా ప్రభుత్వం, ఎన్నికల సంఘం భావిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్చి లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.

Advertisement

రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మేయర్, చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కార్పొరేషన్లలో పోటీ చేసే అభ్యర్థులకు 10 లక్షల రూపాయలు, గ్రేడ్-1 మున్సిపాలిటీల్లో 5 లక్షల రూపాయల వరకు ఖర్చు పరిమితిని విధించారు. ప్రచారం కోసం వినియోగించే సోషల్ మీడియా, ఇతర ఖర్చుల కోసం అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతాలను తెరవడం తప్పనిసరి చేశారు.

Also Read: మీడియాతో కేటీఆర్.. తప్పుడు పనులు చేయలేదు, రెండేళ్లుగా నా పరువుకు బాధ్యులెవరు?

షెడ్యూల్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జిల్లా ఇంఛార్జీలను నియమించి గెలుపు గుర్రాల వేటలో ఉండగా, ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి పార్టీలు కూడా తమ బలాన్ని నిరూపించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుంటూ, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి.

Related News

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Big Stories

Advertisement
×