Telangana Police Jobs Age Limit:తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్లకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాల వయసు పరిమితిని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది.మొత్తానికి ఏజ్ బార్ అయిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరలేమేమో అనుకునే వారికి ఇదొక మంచి అవకాశమని చెప్పాలి.
అదనంగా ఇంకో 3 ఏళ్లు
ఇక ఇప్పటికే ప్రభుత్వం కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయసులో 7 ఏళ్ల సడలింపు ఇవ్వగా తాజాగా దానికి అదనంగా ఇంకో 3 ఏళ్లు పెంచింది. అంటే మొత్తంగా 10 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు లభించినట్లేనన్న మాట. సో వయసు అయిపోయి ఉద్యోగానికి దూరం అయిపోయాం అనుకున్న వాళ్ళంతా ఇపుడు మళ్లీ పోటీ పడొచ్చు.
మూడేళ్ల తేడాను భర్తీ చేయడానికే
అయితే ఈ నిర్ణయానికి ఒక ముఖ్యమైన కారణం ఉందని తెలుస్తుంది. ఎస్ఐ (SI) పోస్టులకు, కానిస్టేబుల్ పోస్టులకు మధ్య వయసులో తేడా ఉండేది. ఎస్ఐ ఉద్యోగానికి 32 ఏళ్ల వరకు అవకాశం ఉంటే, కానిస్టేబుల్ ఉద్యోగానికి మాత్రం 29 ఏళ్ల వరకే ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న మూడేళ్ల తేడాను భర్తీ చేయడానికే కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ఇంకో మూడేళ్లు పెంచారు. దీంతో ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా గరిష్ట వయసు 32 ఏళ్లకు చేరుతుంది.
సమానమైన పోస్టులకు మాత్రమే
అయితే మూడేళ్ల వెసులుబాటు కేవలం కానిస్టేబుల్, దానికి సమానమైన పోస్టులకు మాత్రమే వర్తిస్తుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని ‘పీసీ డ్రైవర్’ పోస్టులకు మాత్రం ఇది వర్తించదు. సో రేపు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ పోస్టుకు ఎంత వయసు ఉందో స్పష్టంగా చూసుకోవాలన్న మాట.
ఇక ఈ కొత్త నిబంధనలు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) చేపట్టే రాబోయే నియామకాలకు వర్తిస్తాయి. దీనికి సంబంధించిన మార్పులను త్వరలోనే అధికారిక గెజిట్‌లో ప్రచురిస్తారు. గెజిట్ వచ్చిన తర్వాత వయసును ఏ తేదీ ఆధారంగా లెక్కిస్తారు అనే వివరాలు పూర్తిగా తెలుస్తాయి.
ALSO READ:ఉన్మాదుల్లా ప్రవర్తించారు.. BRSపై రేవంత్ రెడ్డి ఫైర్
అయితే వయసు పరిమితి పెంచడం వల్ల ఈసారి పోటీ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశమే ఎక్కువ. సో గ్రౌండ్ ప్రాక్టీస్, రాత పరీక్షల కోసం అభ్యర్థులు ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వడం మంచిది.