NDA Expansion: కేంద్రంలో కేబినెట్ ప్రక్షాళనపై ఊహాగానాలు ఊపందుకున్న వేళ.. అసలు లెక్కలు మాత్రం పార్లమెంట్ సంఖ్యా బలంపైనేనా అన్న చర్చ మొదలైంది. NDAలోకి కొత్త పార్టీలను తీసుకురావడం ద్వారా రాజ్యాంగ సవరణలకు అవసరమైన రెండు మూడొంతుల మెజారిటీని సమీకరించే ప్రయత్నాలు జరుగుతోందంటున్నారు. ముఖ్యంగా NCP శరద్ పవార్ వర్గం NDAకు దగ్గరవుతుందన్న ప్రచారంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు డీఎంకే దారెటు అన్నది క్లారిటీ లేకపోయినా NDA వ్యూహంలో ఆ పార్టీపై కూడా చర్చలు జరుగుతున్నాయన్న ఊహాగానాలున్నాయ్. అసలు టార్గెట్ మాత్రం డీలిమిటేషన్‌తో పాటు మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకే ఈ ప్లాన్ అంటున్నారు. ఏప్రిల్‌లో అవసరమైన సంఖ్య లేక బిల్లు ఆగిపోయింది. ఇప్పుడు సంఖ్యాబలం పెంచుకుని మరోసారి బరిలోకి దిగాలన్నదే బిగ్ ప్లాన్ అంటున్నారు. ఈ నెలలో ప్రత్యేక సమావేశాల్లో ఎలాంటి సంచలనాలు ఉంటాయో చూడాలి.