E-Paper
Advertisement

శాటిలైట్ సిగ్నల్స్‌తో సర్వే.. అంగుళం పొరపాటు లేకుండా భూముల లెక్కింపు!

శాటిలైట్ సిగ్నల్స్‌తో సర్వే.. అంగుళం పొరపాటు లేకుండా భూముల లెక్కింపు!
Advertisement

Rover Technology: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో దశాబ్దాలుగా నలుగుతున్న ఫారెస్ట్ ,రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన కొలతలు, పారదర్శకత కోసం నూతన సాంకేతికతను రంగంలోకి దించుతోంది. ఇందులో భాగంగానే మరో 400 అత్యాధునిక రోవర్ యంత్రాలను కొనుగోలు చేసేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. జూన్ 15 లోపు ఈ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే సుమారు 400 లకు పైగా రోవర్ యంత్రాలు ఉన్నప్పటికీ, స్పీడ్ గా సర్వేలు నిర్వహించేందుకు మరో 50 శాతం అదనంగా మిషన్లను కొనుగోలు చేయనున్నారు.

శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా పనిచేసే రోవర్ మిషన్

Advertisement

వీటి ద్వారా సరిహద్దులను వేగంగా గుర్తించి ఫిక్స్ చేయొచ్చనే అభిప్రాయంలో సర్కార్ ఉన్నది. పాత కాలం సర్వేలకు స్వస్తి చెప్పి, టెక్నాలజీతో కూడిన ఈ రోవర్ మిషన్లను సర్వే కొరకు వినియోగించనున్నారు. వాస్తవానికి రోవర్ అనేది శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా పనిచేసే ఒక అధునాతన ఎలక్ట్రానిక్ పరికరం. గతంలో గొలుసులతో కొలిచినప్పుడు అడుగుల తేడా వచ్చే అవకాశం ఉండేది. కానీ రోవర్ ద్వారా కేవలం 2 నుంచి 5 సెంటీమీటర్ల వ్యత్యాసం కూడా లేకుండా కచ్చితమైన రీడింగ్ వస్తుందని అధికారులు చెప్తున్నారు.

మూడు రోజుల్లో వెయ్యి ఎకరాలు..?

Advertisement

సాధారణ విధానంలో సర్వే నిర్వహిస్తే అత్యధిక సమయం పడుతుంది. కానీ ఈ రోవర్లతో కేవలం మూడు రోజుల్లోనే వెయ్యి ఎకరాలను సులువుగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయొచ్చని రెవెన్యూ శాఖ చెబుతుంది. దీంతో ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య నలుగుతున్న భూ పంచాయితీలను అతి తక్కువ సమయంలోనే పూర్తి చేయొచ్చని రెవెన్యూ శాఖ భావిస్తుంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా అటవీ శాఖకు, రెవెన్యూ శాఖకు మధ్య భూ పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనివల్ల ఇటు పర్యావరణ పరిరక్షణకు ఆటంకం కలుగుతోంది. అంతేగాక అటు సాగు చేసుకునే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పంచాయితీని తెగ్గొట్టేందుకు ఇరు శాఖల అధికారులతో కూడిన ఉమ్మడి బృందాలు క్షేత్రస్థాయిలోకి దిగనున్నాయి.కామన్ సర్వే పేరిట పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి సరిహద్దులను ఫిక్స్ చేయనున్నారు. ఈ సర్వే డీఎఫ్​వో, రెవెన్యూ అధికారుల సమక్షంలో జరుగుతుంది.

అధికారుల జాయింట్ సిగ్నేచర్..

​గతంలో సర్వేలు జరిగినా ..ఒక శాఖ రికార్డులను మరో శాఖ అంగీకరించని పరిస్థితి ఉండేది. కానీ ఈసారి నిబంధనలు కఠినతరం చేశారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాజీ రోవర్ల సర్వే పూర్తయిన వెంటనే క్షేత్రస్థాయిలోనే డిజిటల్ మ్యాప్‌లు తయారవుతాయి. ఈ రికార్డులపై ఫారెస్ట్, రెవెన్యూ శాఖల అధికారుల ఉమ్మడి సంతకాలు తప్పనిసరి.ఇరు శాఖల ఆమోద ముద్ర పడిన తర్వాతే ఆ రికార్డులను ఫైనల్ చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ వివాదాలు తలెత్తే అవకాశమే ఉండదు.అంతేగాక ఈ సర్వే ద్వారా సేకరించే ప్రతి ఇంచ్ భూమి సమాచారం అత్యంత భద్రంగా ఉంచుతారు. క్లౌడ్ టెక్నాలజీ సహాయంతో ఈ డేటాను ఇటు రాష్ట్ర ప్రభుత్వ సర్వర్లతో పాటు అటు కేంద్ర ప్రభుత్వ సర్వర్లలోనూ సమాంతరంగా స్టోరేజ్ చేస్తారు. ​దీనివల్ల రికార్డుల ట్యాంపరింగ్ , డేటా మిస్సింగ్ అయ్యే ఛాన్స్ అస్సలుండదని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు

సరిహద్దుల నిర్ధారణలో ‘ట్రాన్స్‌ఫరెన్సీ’ ..

​ఈ సరిహద్దుల ఫిక్సింగ్ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యానికి గానీ, అవినీతికి గానీ తావులేకుండా పూర్తి పారదర్శకతను పాటించనున్నారు. రోవర్ల ద్వారా వచ్చే రీడింగ్స్ శాటిలైట్ నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి మానవ తప్పిదాలు, కావాలని సరిహద్దులు మార్చడానికి వీలుపడదు. అటవీ సరిహద్దుల వెంబడి డిజిటల్ కో-ఆర్డినేట్లతో కూడిన పిల్లర్లను ఏర్పాటు చేస్తారు. దీంతో అటవీ భూముల ఆక్రమణలకు శాశ్వతంగా బ్రేక్ పడనుంది.ఈ సర్వే కోసం ఫారెస్ట్ శాఖలోని భూముల బ్లాక్ లను ఓ యూనిట్ గా తీసుకొని సర్వే నిర్వహిస్తారు. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రెవెన్యూ శాఖ స్పీడప్ చేసింది.

Also Read: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడిన అగ్నికీలలు

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×