E-Paper
Advertisement

ఒకే ఛార్జ్‌ తో 180 కి.మీ రేంజ్.. 50 వేలలో టాప్ ఈవీ స్కూటర్లు ఇవే!

ఒకే ఛార్జ్‌ తో 180 కి.మీ రేంజ్.. 50 వేలలో టాప్ ఈవీ స్కూటర్లు ఇవే!
Advertisement

Top Budget-Friendly Electric Scooters: దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుగుతోంది. నగరాల నుంచి గ్రామాల దాకా ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈవీ మార్కెట్ లో రూ. 50,000 లోపు  మంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, ఇంటి దగ్గర చిన్న పనుల కోసం వాడుకునే వారికి అనుకూలంగా ఉంటాయి. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

⦿ కోమాకి X వన్

ఈ స్కూటర్ ధర సుమారు రూ.35 వేల వరకు ఉంటుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 85 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ధరలో ఇంత మంచి రేంజ్ ఇవ్వడం చాలా మందిని ఆకట్టుకుంటుంది.  రోజూ కాలేజ్‌, ఆఫీస్,  దగ్గర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లాలనుకునే వారికి బాగా సెట్ అవుతుంది.

⦿ యాకూజా రూబీ

Advertisement

దీని ధర సుమారు రూ.35 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్ స్టైలిష్ డిజైన్‌ తో యువతను ఆకట్టుకుంటుంది.  ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 55 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇందులో రివర్స్ గేర్, మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్, ఎలక్ట్రానిక్ ABS లాంటి ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్ స్కూటర్ అయినప్పటికీ లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది.

⦿ ఉజాస్ ఇగో లా

ఉజాస్ ఇగో లా కూడా ప్రస్తుతం ఎంట్రీ లెవల్ EV మార్కెట్లో మంచి గుర్తింపు పొందుతోంది. దీని ధర సుమారు రూ.40 వేల వరకు ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. సాధారణ రోజువారీ వినియోగానికి  అనుకూలంగా ఉంటుంది. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగా ఉన్నాయి.

⦿ యాక్సిలెరో R14

Advertisement

NIJ ఆటోమోటివ్ యాక్సిలెరో R14  ధర సుమారు రూ.50 వేల లోపే ఉంటుంది. కానీ ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ధరలో ఇంత ఎక్కువ రేంజ్ ఇవ్వడంతో ఎక్కువ మంది కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. 250W మోటార్‌ తో వచ్చే ఈ స్కూటర్ తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

⦿ జెలియో ఈవా ఎకో

జెలియో ఈవా ఎకో ధర సుమారు రూ.48 వేల వరకు ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 55 నుంచి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. తక్కువ దూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్కూటర్ చక్కటి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. బరువు తక్కువగా ఉండటం వల్ల మహిళలు, వృద్ధులు కూడా ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది.

Read Also: మండుతున్న పెట్రో ధరలు.. ఈ 5 బైక్‌ లు మీ ఖర్చు తగ్గించేస్తాయి!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×