E-Paper
Advertisement

తెలంగాణ డ్రింక్‌గా తాటి కల్లు.. మే 24న మ్యూజికల్ ఫెస్టివల్

తెలంగాణ డ్రింక్‌గా తాటి కల్లు.. మే 24న మ్యూజికల్ ఫెస్టివల్
Advertisement

Tadikallu festival: స్వేచ్ఛ బ్యూరో: ఈనెల 24న ‘టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్‌పీరియమ్’ తాటి కల్లు మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గురువారం తాటి కల్లు మేళాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాటి నీరా బాటిల్ లను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు.

చిలుకూరు బాలాజీ రూట్ లో రాందేవ్ 150 ఎకరాల్లో 500 కోట్లతో ఎక్స్ పీరియం పార్క్ ఏర్పాటు చేశారన్నారు. వివిధ దేశాల నుంచి తెచ్చిన 500 తాటి చెట్లు 10 కోట్లతో చెట్లను ఎక్స్ పీరియం పార్క్ లో ఏర్పాటు చేస్తున్నారన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనల మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా తాటిమేళాలో పాల్గొనాలని కోరారు. కల్లు ఆరోగ్యానికి మంచిది.. మేజర్ హోటల్ లలో కూడా అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు.

Advertisement

తెలంగాణ డ్రింక్ గా తాటి కల్లు చేయడానికి ప్రభుత్వంలో చర్చిస్తామన్నారు. తాటి కల్లు ప్రకృతి రీత్యా దొరుకుతుంది.. ఆరోగ్యానికి చాలా మంచిది.. సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయన్నారు. తాటి ఈత వనాలు పెంచుకునే వారు మే 24 వ తేదీన జరిగే ‘టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్‌పీరియమ్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈజీఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా తాటి ఈత వనాలు నాటి పెంచుతున్నామన్నారు. గ్రామాల్లో నర్సరీ లలో తాటి ఈత మొక్కలు పెంచాలని, కిడ్నీ లో రాళ్ళు వచ్చిన కల్లుతాగితే పోయన్నారు. మనసు ఉల్లాసానికి, ఆరోగ్యానికి తాటి కల్లు అమృతం లాగా పని చేస్తుందన్నారు. గీతావృత్తి బతకాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. నేచర్ కాపాడాలి.. అని కోరారు.

Also Read: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం.. 2026-27 నుండి కొత్త రూల్స్ ఇవే!

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×