E-Paper
Advertisement

BRAP: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్‌లో తెలంగాణ.. BRAP 2024లో “టాప్ అచీవర్”గా గుర్తింపు

BRAP: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్‌లో తెలంగాణ.. BRAP 2024లో “టాప్ అచీవర్”గా గుర్తింపు
Advertisement

BRAP: సంస్కరణలు, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. వ్యాపార సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో మరోసారి తన సత్తాను చాటుకుంది. భారత ప్రభుత్వ పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT) ప్రారంభించిన ‘బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ (BRAP) 2024’లో తెలంగాణ రాష్ట్రం “టాప్ అచీవర్”గా అత్యున్నత గౌరవాన్ని దక్కించుకుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాపార వాతావరణాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో BRAP 7వ ఎడిషన్‌ను కేంద్రం ప్రారంభించింది.

BRAP 2024 నివేదికను విస్తృతమైన సంప్రదింపులు, వాటాదారుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించారు. ఇందులో మొత్తం 434 సంస్కరణల పాయింట్లు ఉన్నాయి. ముఖ్యంగా కార్మిక చట్టాలు, భూసేకరణ పరిపాలన, ఆస్తి రిజిస్ట్రేషన్, పెట్టుబడి సౌకర్యాలు, పర్యావరణ అనుమతులు వంటి కీలక అంశాలను ఈ సంస్కరణలు కవర్ చేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ మార్గదర్శకాల ప్రకారం అన్ని విధాన సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడమే కాకుండా, 13 కీలక శాఖలలో 1,467 కాంప్లయెన్స్‌లను (నిబంధనల భారాన్ని) తగ్గించింది. ఈ చర్యల ద్వారా సమర్థవంతమైన పరిపాలన, పారదర్శకత, వ్యాపారానుకూల వాతావరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత మరోసారి స్పష్టంగా వెల్లడైంది.

Advertisement

ఈ విశిష్ట ప్రదర్శనకు గుర్తింపుగా, BRAP 2024లో తెలంగాణ రాష్ట్రం నాలుగు ప్రధాన విభాగాల్లో “టాప్ అచీవర్” గౌరవాన్ని సాధించింది. ఆ విభాగాలు: బిజినెస్ ఎంట్రీ (వ్యాపార ప్రారంభం), కన్‌స్ట్రక్షన్ పర్మిట్ ఎనేబ్లర్స్ (నిర్మాణ అనుమతులు), సర్వీస్ సెక్టార్ (సేవా రంగం), ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (భూ పరిపాలన). మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  సంజయ్ కుమార్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×