E-Paper
Advertisement

Telangana Weather: నైరుతి రుతుపవనాలు.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక, రాబోయే 48 గంటలు జాగ్రత్త

Telangana Weather: నైరుతి రుతుపవనాలు.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక, రాబోయే 48 గంటలు జాగ్రత్త
Advertisement

Telangana Weather Updates: నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ పరిస్థితులను గమనిస్తే ఈనెల 31 నుంచి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశముందని తెలిపింది. అదే సమయంలో వడగాలుల తీవ్రత పెరగడంతో రుతుపవనాల రాక ఆలస్యం కావచ్చని తెలిపింది. ఈ లెక్కన తెలంగాణలోకి రుతుపవనాలు జూన్‌ రెండో వారంలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది.

దేశంలోని నైరుతి రుతుపవనాలు రాక మరింత ఆలస్యం

Advertisement

రుతుపవనాలు కేరళలో ప్రవేశించే ముందు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం దక్షిణాది రాష్ట్రాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఎండలతో అల్లాడుతున్న ఉత్తరాది రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సంబంధిత రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మే 26, 27 మధ్య అంటే రాబోయే 48 గంటల్లో తెలంగాణలోని దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక, రాబోయే 48 గంటలు జాగ్రత్త

వర్షాలు పడే సమయంలో గంటకు 60 కిలోమీటర్లు వేగంగా ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావచ్చని తెలిపింది. ఆ సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

ఇక హైదరాబాద్ నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 40 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. రాబోయే కొన్ని గంటల్లో ఆసిఫాబాద్, మంచిర్యాల లోని కొన్ని ప్రాంతాల్లో చెదురు మదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి.

ALSO READ: లంబాడీల ధర్నాకు హరీశ్ రావు మద్దతు.. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం

జగిత్యాల, పెద్దపల్లిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అటు యాదాద్రి-భువనగిరి, నల్గొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అదే సమయంలో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 43 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

Related News

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

బహదూర్‌గూడలో హైటెన్షన్.. పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరేసిన రైతులు.. ఎందుకంటే?

Food Adulteration Law: ఆహార కల్తీ దందాకు ఇక చెక్.. తెలంగాణలో రాబోతున్న కొత్త చట్టం ఇదే!

Big Stories

Advertisement
×