E-Paper
Advertisement

Free Visa: శ్రీలంక బంపర్ ఆఫర్.. ఇండియన్ టూరిస్టులకు ఫ్రీ వీసా!

Free Visa: శ్రీలంక బంపర్ ఆఫర్.. ఇండియన్ టూరిస్టులకు ఫ్రీ వీసా!
Advertisement

Sri Lanka New Free Visa Policy: శ్రీలంకకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై భారతీయ పర్యాటకులు శ్రీలంకకు వెళ్తే 30 రోజుల పాటు ఉచిత ఆన్ అరైవల్ వీసా సౌకర్యాన్ని కల్పించనుంది. ఈ నిర్ణయాన్ని ఇటీవల శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.  ఈ నిర్ణయంతో విదేశీ టూర్ ప్లాన్ చేసే భారతీయులకు ప్రయాణ ఖర్చు కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.

30 రోజుల ఫ్రీ ఆన్ అరైవల్ వీసా

తాజా నిబంధనల ప్రకారం, భారతీయులు శ్రీలంకకు చేరుకున్న తర్వాత ఉచిత వీసా పొందే అవకాశం ఉంటుంది. ఈ వీసా 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇందులో డబుల్ ఎంట్రీ కూడా ఉంటుంది. అంటే ఒకసారి శ్రీలంకకు వెళ్లిన తర్వాత ఆ 30 రోజుల వ్యవధిలో మరోసారి అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు విదేశీ ప్రయాణాల్లో వీసా ఫీజులు టూరిస్టులకు ఎక్కువ భారంగా ఉండేవి. ముఖ్యంగా కుటుంబంతో వెళ్లే పర్యాటకులకు ఈ ఖర్చు మరింత పెరిగేది. ఇప్పుడు ఉచిత ఆన్ అరైవల్ వీసా అందుబాటులోకి రావడంతో భారతీయ పర్యాటకులలో శ్రీలంక టూర్లపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.

ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ తప్పనిసరి!   

Advertisement

అయితే, వీసా ఉచితం అయినప్పటికీ ప్రయాణికులు ముందుగానే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని శ్రీలంక ఇమ్మిగ్రేషన్ విభాగం వెల్లడించింది. అంటే ప్రయాణానికి ముందు ఆన్‌లైన్‌లో ETA కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ ప్రక్రియ మరింత సులభంగా సాగుతుంది.

భారత్ నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్టులు

భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో పర్యాటకులు శ్రీలంకను సందర్శిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంకకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. బీచ్‌లు, చారిత్రక ప్రదేశాలు, బౌద్ధ ఆలయాలు, ప్రకృతి అందాలు, తక్కువ ఖర్చుతో ట్రిప్ పూర్తి చేయగలగడం వల్ల శ్రీలంక భారతీయులకు ఎంతో ఇష్టమైన టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారింది.

మరో 40 దేశాలకు ఉచిత ఆన్ అరైవల్ వీసా

Advertisement

భారతదేశంతో పాటు మరో 40 దేశాలకు కూడా ఈ ఉచిత ఆన్ అరైవల్ వీసాను ప్రకటించింది శ్రీలంక. వీటిలో యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, చైనా, రష్యా వంటి దేశాలు ఉన్నాయి. అటు సింగపూర్, మాల్దీవులు, సీషెల్స్ లాంటి దేశాలతో ప్రత్యేక ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ కొత్త నిర్ణయంతో శ్రీలంక టూరిజం రంగానికి మరింత బూస్టింగ్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుందని ట్రావెల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: 60 రోజుల ఫ్రీ ఎంట్రీ క్యాన్సిల్.. ఇక థాయ్‌లాండ్‌కు వెళ్లాలంటే వీసా ఉండాల్సిందే!

Related News

దేశంలో ఫస్ట్ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ రెడీ.. వందే భారత్‌కు మించి వేగంతో దూసుకెళ్లనున్న రైళ్లు!

సముద్రంలో ఈ పసుపు గుర్తు కనిపిస్తే జాగ్రత్త! ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరి ఎందుకు చేశారు? కారణాలేంటీ?

బ్రిటీషర్ల నాటి వైభవం.. మన దేశంలోనూ ‘లండన్’ ఉందోచ్.. విశేషాలు ఇవే!

మెట్రో రైలుకు గ్లోబల్ గుర్తింపు, ఆ సర్టిఫికేషన్ సాధించిన తొలి సంస్థగా..

అమృత్ భారత్ రైళ్లలో సూపర్ స్పెసిలిటీస్.. వెర్షన్ 3.0 చూస్తే మతిపోవాల్సిందే!

రాఖీ పండుగ వేళ రైల్వే గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్!

రైల్వే బెడ్‌ షీట్లు కొట్టేసి.. శాలువాలుగా కప్పుకొని.. నెట్టింట వీడియో వైరల్!

Big Stories

Advertisement
×