E-Paper
Advertisement

లంబాడీల ధర్నాకు హరీశ్ రావు మద్దతు.. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం

లంబాడీల ధర్నాకు హరీశ్ రావు మద్దతు.. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం
Advertisement

Harish Rao: చేవెళ్ల డిక్షరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ పార్టీ దగా చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన లంబాడీ హక్కుల పోరాట సమితి ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మద్దతు ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇది ధర్నా కాదని, లంబాడీల ఆత్మ గౌరవ పోరాటం అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బుద్ది చెప్పేందుకు లంబాడీలు సమరశంఖం పూరించారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు లంబాడీల వద్ద చేతులు జోడించిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చాక వారి చేతులకు బేడీలు వేశారని మండిపడ్డారు.

తమ భూములు లాక్కోవద్దని చెప్పినందుకు ఆడవాళ్లు, గర్భిణీలు అని చూడకుండా పోలీసులతో దాడులు చేయించారని హరీశ్ రావు ఆరోపించారు. 45 మంది లంబాడి బిడ్డలను జైల్లో పెట్టారని మండిపడ్డారు. చేవెళ్ల డిక్లరేషన్ లో కాంగ్రెస్ చెప్పిన ఒక్కటీ అమలు కాలేదని.. పోడు భూములకు పట్టాలు ఇస్తామని మోసం చేసారని దుయ్యబట్టారు. పట్టాలు ఇవ్వకపోగా.. 50 వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములు లాక్కున్నారని ఆరోపించారు. కొడంగల్ లంబాడీ బిడ్డలు.. రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడతారని హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

పది, ఇంటర్, పీజీ పాసైతే కొత్తగా మరికొన్ని ఐటీడీఏలు ఏర్పాటు చేసి.. ఆర్థిక సాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారని హరీశ్ రావు గుర్తుచేశారు. కొత్తగా ఐటీడీఏలు పెట్టకపోగా.. ఉన్న వాటికి రూపాయి నిధులు కూడా ఇవ్వలేదన్నారు. రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు వచ్చాయి కానీ లంబాడీలకు మాత్రం రాలేదన్నారు. మరోవైపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. 16 వేల ఉద్యోగాలతో చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో లంబాడీలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే స్వయంగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారని హరీశ్ రావు గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఖర్గేనే బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 4 రైళ్లు వేసుకొని దిల్లీ వచ్చి.. ఖర్గే ఇంటి ముందు ధర్నా చేస్తామని హరీశ్ రావు హెచ్చరించారు. లంబాడీలు చాలా మంచి వాళ్లు అన్న హరీశ్ రావు.. మోసం చేస్తే మాత్రం ఎంతకైనా తెగిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గిరిజనుల మీద దాడులు పెరిగాయన్న ఆయన.. పైగా ఎదురు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

Advertisement

Also Read: స్మార్ట్‌ఫోన్ రీస్టార్ట్ చేయాలా? పవర్ ఆఫ్ చేయాలా? అసలు రెండింటికీ తేడా ఏంటి?

ఎస్సీ కార్పొరేషన్ కు రూ.2730 కోట్లు బడ్జెట్ లో పెట్టి రూ. 50 కోట్లు మాత్రమే రేవంత్ సర్కార్ ఖర్చు పెట్టిందని హరీశ్ రావు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెండున్నరేళ్లలో ఒక్క పైసా ఇచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఇందిరా పార్క్ లో ప్రారంభమైన ఈ ధర్నా కేవలం ఆరంభం మాత్రమేనన్న హరీశ్ రావు.. రేపు ప్రతీ తండాలో నగరా మోగాలని పిలుపునిచ్చారు. తండాల నుంచి వెళ్లి ఖర్గే ఇంటి ముందు ధర్నా చేద్దామని విజ్ఞప్తి చేశారు.

Also Read: ప్రీపెయిడ్ vs పోస్ట్‌పెయిడ్ సిమ్.. రెండింటికి తేడా ఏంటి? సామాన్యులకు ఏది బెస్ట్?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×