E-Paper
Advertisement

TGPSC Group-1 Mains Schedule Out: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ.. పరీక్ష షెడ్యూల్ వివరాలు..

TGPSC Group-1 Mains Schedule Out: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ.. పరీక్ష షెడ్యూల్ వివరాలు..
Advertisement

TGPSC Group-1 Mains Schedule Released: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రౌప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. ఇటీవలే కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ప్రిలిమ్స్ పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించనుంది. గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉండగా.. క్వాలిఫైయింగ్ పేపర్‌గా జనరల్ ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గం. నుంచి 5:30 గం. వరకు నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది.

పరీక్ష షెడ్యూల్
  • జనరల్ ఇంగ్లీష్– అక్టోబర్ 21
  • పేపర్ 1 జనరల్ ఎస్సే– అక్టోబర్ 22
  • పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ– అక్టోబర్ 23
  • పేపర్ 3 ఇండియన్ సొసైటీ, గవర్నెన్స్, భారత రాజ్యాంగం– అక్టోబర్ 24
  • పేపర్ 4 ఎకానమీ & డెవలప్‌మెంట్– అక్టోబర్ 25
  • పేపర్ 5 సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్– అక్టోబర్ 26
  • పేపర్ 6 తెలంగాణ ఉద్యమ చరిత్ర– అక్టోబర్ 27
Advertisement

Also Read: MP Raghunandan Rao: సంచలన వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావు.. కేసీఆర్‌పై కేసు నమోదు..?

ప్రిలిమ్స్ పరీక్ష కఠినతరంగా వచ్చిందని అభ్యర్థులు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రాథమిక కీ విడుదల చేయాల్సి ఉంది. గురువారం(జూన్ 13) ప్రాథమిక కీ ను విడుదల చేయనున్నట్లు కమిషన్ వెబ్ నోట్ విడుదల చేసింది. 1:50 నిష్పత్తి ఆధారంగా మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మల్టీజోన్ 1,2 వారిగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది కమిషన్.

Advertisement

ఇప్పటికే రెండు సార్లు రద్దైన గ్రూప్-1 పరీక్షను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పాత నోటిఫికేషన్‌కు మరో 63 పోస్టులు జోడించి మొత్తంగా 563 పోస్టులకు జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించింది.

Tags

Related News

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

Big Stories

Advertisement
×