BigTV English

MP Raghunandan Rao: సంచలన వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావు.. కేసీఆర్‌పై కేసు నమోదు..?

MP Raghunandan Rao: సంచలన వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావు.. కేసీఆర్‌పై కేసు నమోదు..?

MP Raghunandan Rao Comments(Telangana politics): తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు భారీ షాక్ ఎదురైనట్టయ్యింది. ఇటీవల మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన రఘునందన్ రావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితమే కేసీఆర్ పై కేసు నమోదు అయ్యిందని తెలిపారు. గొర్రెల స్కాంలో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్, హరీశ్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండుగ అంటూ రఘునందన్ రావు అన్నారు. రఘునందన్ రావు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ అంశంపై భారీగా చర్చ కొనసాగుతున్నది. ఈ కేసులో కేసీఆర్ పై కేసు నమోదు అయ్యిందా..? అయితే, కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా? అంటూ చర్చిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో కేసీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో రఘునందన్ రావు ఇలా వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంలో తీవ్ర చర్చ నడుస్తున్నది.

కాగా, ఈ పథకానికి సంబంధించి గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు రూ. 700 కోట్ల వరకు కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఏసీబీ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. మరోవైపు ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. భారీగా డబ్బు చేతులు మారినట్లు అభియోగాలు రావడం, ఇతర రాష్ట్రాల్లోనూ లింకులుండడంతో ఇందులో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనున్నది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్ లు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాల తదితర సమాచారం ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ లేఖ రాసినట్టు సమాచారం.


Also Read: అధికారుల నిర్లక్ష్యం, స్కూల్స్ ఓపెన్, పుస్తకాలు వెనక్కి..

అదేవిధంగా గొర్రెల రవాణా ఏజెన్సీలకు సంబంధించిన సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెల కోసం కొనుగోలు చేసిన దాణా, ఆ దాణాను ఏయే లబ్ధిదారులకు పంపించారు..? ఇందుకోసం ఎవరికి నిధులిచ్చారనే అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. జరిగినటువంటి అవినీతిపై అంతర్గత నివేదికలకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

Tags

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×