E-Paper
Advertisement

TG Group 1 Prelims Exam: కాసేపట్లో తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష, దాదాపు నాలుగు లక్షల మందికిపైగా..!

TG Group 1 Prelims Exam: కాసేపట్లో తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష, దాదాపు నాలుగు లక్షల మందికిపైగా..!
Advertisement

Telangana Group 1 Prelims Exam: తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష కాసేపట్లో మొదలుకానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారు. ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ జరగనుంది.

పరీక్ష రాసే అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచన చేశారు. లేకుంటే అనుమతించేది స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మొత్తం 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Advertisement

గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ అత్యధికంగా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులను భారీ ఎత్తున మొహరించింది ప్రభుత్వం. పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. హాల్ టికెట్ కలర్ ప్రింట్ తీసుకోవాలన్నది అందులోని కీలక సూచన.

Also Read: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

Advertisement

దీనికితోడు హాట్ టికెట్ పై లేటెస్ట్ ఫోటోను అభ్యర్థులు అంటించాలి. ఫోటో ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. అనుకున్న సమయానికి ఏమాత్రం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

Tags

Related News

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

Big Stories

Advertisement
×