E-Paper
Advertisement

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్..  మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో
Advertisement

Hydrabad City: హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్. నగరంలో ఫ్లైఓవర్-ఎలివేటెడ్ కారిడార్ల పనుల కారణంగా ఏదో ఓ చోట ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. సైదాబాద్ వై జంక్షన్ నుండి యాదగిరి థియేటర్ వరకు కారిడార్ నిర్మాణ పనుల కారణంగా మంగళవారం వరకు రహదారిని ఒక వైపును పూర్తిగా మూసి వేస్తున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నారు ట్రాఫిక్ పోలీసులు.

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్-హైదరాబాద్ సిటీలోని సైదాబాద్ జంక్షన్ నుంచి యాదగిరి థియేటర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జూలై 18-21 వరకు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, దారులు మళ్లించారు. దీని ప్రకారం రహదారికి ఒక వైపు మూసి వేయనున్నారు.

Advertisement

మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు-వాహనదారులు వీలైనంత వరకు ఈ మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పారు. అత్యవసర సహాయం కోసం 9010203626 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పలు మార్గాల్లో వాహనాల మళ్లింపులు చేపట్టారు పోలీసులు.

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు-నల్గొండ ఎక్స్ రోడ్స్ నుండి చాంద్రాయణ గుట్ట వెళ్లే వాహనాలను సైదాబాద్ వై జంక్షన్, సరస్వతి నగర్, చంపాపేట్, లక్ష్మారెడ్డి గార్డెన్ మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. డీఎంఆర్‌ఎల్ నుండి నల్గొండ ఎక్స్ రోడ్స్ వైపు వెళ్లే వాహనాలను లక్ష్మారెడ్డి గార్డెన్, ఐఎస్ సదన్, సింగరేణి, చంచల్‌గూడ, మలక్‌పేట్ ఫైర్ స్టేషన్ మార్గంలో వెళ్లనున్నాయి. స్థానిక వాహనదారులు అందుబాటులో ఉన్న రోడ్లను వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

టూ, త్రీ వీలర్స్ వాహనాలు ఎడమ వైపు క్యారేజ్‌వేను రెండు వైపులా రాకపోకలు సాగించే రహదారిగా ఉపయోగిస్తాయి. ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను మలక్‌పేట్, మూసారంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట్, ఎల్బీ నగర్ మీదుగా మళ్లిస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు. ప్రభావితమైన మార్గంలో వాహనాల రాకపోకలు నెమ్మదిగా వెళ్లాలన్నారు.

ALSO READ: టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×