E-Paper
Advertisement

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Mahindra’s Next Big SUV Launches: ప్రతి ఏడాది ఆగస్టు 15ను మహీంద్రా కొత్త వెహికల్స్ తో పాటు న్యూ టెక్నాలజీని పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో థార్.e, XUV.e, BE సిరీస్, గ్లోబల్ పికప్ కాన్సెప్ట్  లాంటి మోడళ్లను ఇదే రోజున ఆవిష్కరించిన కంపెనీ, ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించనుంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మూడు రోజులపాటు నిర్వహించడంతో పాటు పలు కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ అవేంటంటే..

స్కార్పియో N ఫేస్‌ లిఫ్ట్

మహీంద్రా తొలుత స్కార్పియో N ఫేస్‌ లిఫ్ట్ ను విడుదల చేయనుంది. మెకానికల్ మార్పులు పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అందిస్తున్న 2.2 లీటర్ డీజిల్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లనే కొనసాగించే అవకాశముంది. డిజైన్ పరంగా కొత్త ఫ్రంట్ గ్రిల్, న్యూ హెడ్‌ ల్యాంప్స్, కొత్త బంపర్, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ లాంటి మార్పులు కనిపించే అవకాశం ఉంది. క్యాబిన్‌ లో పెద్ద 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్, కొత్త డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌ రూఫ్ లాంటి అత్యాధునిక ఫీచర్లు జోడించే అవకాశం ఉంది. అలాగే, ADAS భద్రతా ఫీచర్లను మరిన్ని వేరియంట్లలో అందించే అవకాశం కూడా ఉంది.

విజన్ S

Advertisement

ఇక విజన్ S.. నాలుగు మీటర్ల లోపు సైజులో ఉండే కొత్త SUV. మహీంద్రా రూపొందించిన కొత్త NU_IQ ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా వచ్చే తొలి మోడల్ ఇదే కావొచ్చు. కాన్సెప్ట్ మోడల్‌ లో కనిపించిన బాక్సీ డిజైన్‌ ను దాదాపు అలాగే ఉంచి, రోడ్డు వినియోగానికి అవసరమైన మార్పులతో ప్రొడక్షన్ వెర్షన్‌ ను తీసుకురానున్నారు. కాన్సెప్ట్‌ లో కనిపించిన కొన్ని ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్స్ ను తొలగించే అవకాశం ఉంది. ఈ SUVను పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్లతో తీసుకురావచ్చని సమాచారం. పలు రకాల వినియోగదారులకు ఇది సరిపోయే మోడల్‌ గా మారే అవకాశం ఉంది.

BE 07

మూడో మోడల్ BE 07. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ SUVగా రానుంది. మహీంద్రా INGLO ప్లాట్‌ ఫారమ్‌ పై అభివృద్ధి చేస్తున్న ఈ మోడల్‌ లో భవిష్యత్ తరహా డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, స్లిమ్ LED హెడ్‌ ల్యాంప్స్, స్పోర్టీ బంపర్, పెద్ద అల్లాయ్ వీల్స్, వాలుగా ఉండే రూఫ్‌ లైన్, ప్రత్యేకమైన వెనుక భాగం దీని లుక్‌ ను మరింత ఆకర్షణీయంగా మార్చనున్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే, ప్రస్తుతం XUV 9Sలో అందిస్తున్న 59kWh, 70kWh, 79kWh బ్యాటరీ ప్యాక్‌ లలో ఏదో ఒకటి, అంతకంటే మెరుగైన ఆప్షన్లు ఇందులో ఉండే అవకాశముంది. మొత్తంగా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్, విజన్ S, BE 07 మోడళ్లు మార్కెట్‌లోకి వస్తే భారత SUV విభాగంలో పోటీ మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Read Also: కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×