E-Paper
Advertisement

Church Pastor Case: పాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. యువతితో వాట్సప్ చాట్ లీక్.. నువ్వు తప్ప ఎవరూ లేరంటూ..!

Church Pastor Case: పాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. యువతితో వాట్సప్ చాట్ లీక్.. నువ్వు తప్ప ఎవరూ లేరంటూ..!
Advertisement

Church Pastor Case: హైదరాబాద్ లో ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని వేధించిన లివింగ్ చర్చి ఫాదర్ జోసెఫ్ సందీప్ వడేగర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలతో పాస్టర్ చేసిన వాట్సప్ చాట్ లీక్ అయ్యింది. అదే సమయంలో బాధితురాలని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసిన ఫొటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వాట్సప్ చాట్ లో ఏముందంటే?

పాస్టర్ జోసెఫ్ సందీప్, బాధితురాలికి మధ్య జరిగిన చాట్ అంటూ నెట్టింట కొన్ని స్క్రీన్ షాట్స్ చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం.. మన మధ్య ఉన్న రిలేషన్ ఏంటని  పాస్టర్ ను యువతి నిలదీసింది. అప్పుడు అవతలి వ్యక్తి బదులిస్తూ తాను ప్రేమిస్తున్నానని.. పెళ్లి కూడా చేసుకుంటానని సమాధానం ఇచ్చారు. తనను అపార్థం చేసుకోవద్దని.. తన జీవితానికి నువ్వు తప్ప ఇంకొకరు లేరని స్పష్టం చేశారు.

Advertisement

‘నా మెసేజ్ సేవ్ చేసుకో’

కావలంటే తాను చేస్తున్న మెసేజ్ సేవ్ చేసుకోవాలని.. నిన్నే పెళ్లి చేసుకుంటానని బాధితురాలితో పాస్టర్ చెప్పినట్లుగా ఈ చాట్ కనిపిస్తోంది. నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాని బాధితురాలితో ఏమోషనల్ డ్రామా ఆడినట్లు అర్థమవుతోంది. అయితే పెళ్లి చేసుకోవాలని ఉన్నా.. ఇప్పటికిప్పుడు వివాహం చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయని చాట్ లో పాస్టర్ పేర్కొన్నారు. అందుకు కారణాలేంటో నీకు కూడా బాగా తెలుసని బాధితురాలితో చెప్పారు. ప్రస్తుతం ఈ వాట్సప్ చాట్.. కేసు దర్యాప్తులో కీలకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Advertisement

Also Read: US Crime: అమెరికాలో ఘోరం.. కూతుర్ని దారుణంగా చంపిన.. భారత సంతతి మహిళ

యువతి ఫిర్యాదు ఏంటంటే?

ఇదిలా ఉంటే.. సోమవారం (ఫిబ్రవరి 23న) పాస్టర్ జోసెఫ్ సందీప్ పై బాధితురాలు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశారని.. లక్షలాది రూపాయాలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అతడి అసలు రంగు బయటపడిందన్నారు. పాస్టర్ కు మరో వివాహితతో సంబంధం ఉందని.. ఆమెతో కలిసి దుబాయి, గోవా వంటి ప్రాంతాల్లో విహరిస్తున్నారని ఆరోపించారు. ఇదేంటని నిలదీస్తే చంపేస్తానని బెదిరించాడని.. తనతో ఉండాలంటే మరో మహిళతో తనకున్న సంబంధాన్ని అంగీకరించాలని షరతు సైతం పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read: NCERT Controversy: ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశ వివాదం.. కేంద్ర విద్యామంత్రి విచారం.. కీలక ఆదేశాలు జారీ

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×