E-Paper
Advertisement

NCERT Controversy: ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశ వివాదం.. కేంద్ర విద్యామంత్రి విచారం.. కీలక ఆదేశాలు జారీ

NCERT Controversy: ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశ వివాదం.. కేంద్ర విద్యామంత్రి విచారం.. కీలక ఆదేశాలు జారీ
Advertisement

NCERT Controversy: ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశాన్ని చేర్చడంపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో దీనిపై గురువారం స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. జరిగిన తప్పిదంపై విచారం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు అత్యున్నత గౌరవం ఉందని పేర్కొన్నారు.

పాఠ్యాంశ వివాదం తన దృష్టికి వచ్చిన వెంటనే.. అన్ని పుస్తకాలను ఉపసంహరించుకోవాలని NCERTని ఆదేశించినట్లు కేంద్రమంత్రి చెప్పారు. ఆ పుస్తకాలు బయటకు రాకుండా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థను అగౌరవపరిచే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని ధర్మేంద్ర ప్రధాన్ తేల్చి చెప్పారు.

Advertisement

అయితే పాఠ్యాంశ వివాదాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి అన్నారు. తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై NCERTపై విచారణ జరుగుతోందన్న ఆయన.. దీని వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా న్యాయవ్యవస్థకు తాను హామీ ఇస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

Also Read: Air Cooler Deals: సమ్మర్ బొనాంజా.. కూలర్లపై 70% వరకూ డిస్కౌంట్.. లేటు చేశారో చేజారినట్లే!

Advertisement

ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం చేర్చడాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా తప్పుబట్టారు. న్యాయవ్యవస్థ అధికారాన్ని అణిచివేసేలా, గౌరవాన్ని తగ్గించేలా ఉద్దేశపూర్వకంగా తీసుకున్న చర్యగా దీనిని అభివర్ణించారు. న్యాయ వ్యవస్థ అవినీతి గురించి ఏకంగా ఒక పాఠ్యాంశాన్నే చేర్చిన NCERT.. కోర్టుల విశిష్టత గురించి మాత్రం విస్మరించిందని పేర్కొన్నారు.

Also Read: Epstein Files: బికినీ అమ్మాయిలు.. చేతిలో మద్యం.. స్టీఫెన్ హాకింగ్ ఫొటో కలకలం

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×