E-Paper
Advertisement

US Crime: అమెరికాలో ఘోరం.. కూతుర్ని దారుణంగా చంపిన.. భారత సంతతి మహిళ

US Crime: అమెరికాలో ఘోరం.. కూతుర్ని దారుణంగా చంపిన.. భారత సంతతి మహిళ
Advertisement

US Crime: అగ్రరాజ్యం అమెరికాలో నాలుగేళ్ల బాలిక అనుమానస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లే కూతుర్ని హత్య చేసి.. సాధారణ మరణంగా చిత్రకరించే ప్రయత్నం చేసిందని ధ్రువీకరించారు. అయితే ఈ దారుణానికి పాల్పడిన మహిళ.. పిల్లల వైద్యురాలు కావడం గమనార్హం. 37 ఏళ్ల నేహా గుప్తా  (Dr Neha Gupta) ఈ దారుణానికి ఒడిగట్టడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే..

ఫ్లోరిడాలో గతేడాది జూన్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. అద్దె ఇంట్లో నివసిస్తున్న నేహా గుప్తా ఇంటి నుంచి పోలీసులకు (911 నెంబర్) కాల్ వెళ్లింది. అర్ధరాత్రి సమయంలో తన కూతురు బయటకొచ్చి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయిందని.. త్వరగా వచ్చి కాపాడాలని నేహా ఎంతో కంగారుగా పోలీసులకు చెప్పింది. అక్కడికి హుటాహుటీనా చేరుకున్న పోలీసులు.. అప్పటికే బాలిక చనిపోయినట్లు నిర్ధారించారు.

అనుమానస్పదంగా నేహా వైఖరి

Advertisement

అయితే తల్లి నేహా వైఖరి అనుమానస్పదంగా అనిపించడంతో పోలీసులు ఆమెను విచారించారు. విచారణ సమయంలో కీలక ప్రశ్నలు సంధించారు. అయితే పాప బయటకు వచ్చిన సమయంలో తాను నిద్రిస్తున్నానని.. ఏదో శబ్దం వినిపించి బయటకు రాగా పాప నీటిలో కనిపించిందని తెలిపారు. తనకు ఈత రాకపోవడంతో కాపాడే ప్రయత్నం చేయలేకపోయానని నేహా చెప్పారు. పాపను రక్షించడానికి ఏదైనా చేయాలని ఫోన్ లో సూచించినప్పటికీ నేహా ఆ దిశగా ప్రయత్నించకపోవడం అనుమానాలను మరింత బలపరిచింది.

గుట్టు విప్పిన పోస్టుమార్టం

స్విమ్మింగ్ పూల్ లో బిడ్డ ఎంత సేపు ఉందని పోలీసులు ప్రశ్నించగా.. సుమారు 20 నిమిషాలు ఉన్నట్లు నేహా సమాధానమిచ్చారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్టులో బాలిక ఊపిరితిత్తులు లేదా కడుపులో నీరు కనిపించలేదు. నీటిలో పడిపోవడానికి ముందే బాలిక చనిపోయిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో ఆమెను అరెస్టు చేసిన ఎటువంటి బాండ్ లేకుండా జైలుకు తరలించారు.

Advertisement

Also Read: Air Cooler Deals: సమ్మర్ బొనాంజా.. కూలర్లపై 70% వరకూ డిస్కౌంట్.. లేటు చేశారో చేజారినట్లే!

మానసిక స్థితి సరిగా లేదా?

అయితే చిన్నారి అరియా మరణం ప్రమాదవశాత్తు జరిగిందేనని ఆమె తరపు లాయర్లు వాదిస్తున్నారు. మరోవైపు నేహా భర్త.. భార్యకు వ్యతిరేకంగా కోర్టులో వాదనలు వినిపించారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని పేర్కొన్నారు. ఆమెను పూర్తిస్థాయిలో కస్టడీలోకి తీసుకోవాలని చెప్పారు. తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా కూతుర్ని ఫ్లోరిడాకు తీసుకెళ్లిందని ఆరోపించారు.

Also Read: NCERT Controversy: ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశ వివాదం.. కేంద్ర విద్యామంత్రి విచారం.. కీలక ఆదేశాలు జారీ

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×