E-Paper
Advertisement

Yennam Srinivas Reddy: ఆ మీటింగ్ తరువాత అన్ని బయటపడుతాయ్.. తొందరెందుకు? : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Yennam Srinivas Reddy: ఆ మీటింగ్ తరువాత అన్ని బయటపడుతాయ్.. తొందరెందుకు? : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Advertisement

Yennam Srinivas Reddy Serious on BRS: కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సీరియస్ అయ్యారు. ‘పీఏసీ కమిటీలో ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి చెందని వ్యక్తులు లేరు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండి మేడిగడ్డ బ్యారేజీలో కమీషన్లు తిన్నారు. మళ్లీ ఈరోజు పీఏసీ చైర్మన్ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గత బీఆర్ఎస్ లో జరిగిన అక్రమాలను, కుంభకోణాల వివరాలను ప్రజల ముందు పెడుతాం’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Also Read: కేటీఆర్.. నీకు దమ్ముంటే ఆధారాలు చూపించు.. నేను రాజీనామా చేస్తా… లేకపోతే నువ్వు చేస్తావా? : పొంగులేటి

Advertisement

కాగా, అసెంబ్లీ హాలులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసలు చైర్మన్ ఎన్నికే చెల్లదంటూ వారు వాదించారు. ఆ తరువాత మిగతా ఎమ్మెల్యేలు పీఏసీ సమావేశాన్ని కొనసాగించారు. పలు అంశాలపై పీఏసీ విస్తృతంగా చర్చించింది.

ఇదిలా ఉంటే.. వాకౌట్ చేసిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ విభిన్న వాదనను వినిపించారు. పీఏసీ చైర్మన్ ఎన్నిక చెల్లదన్నారు. పద్ధతి ప్రకారం ఆ ఎన్నిక జరగలేదన్నారు. ఆ ఎన్నికను ఖండిస్తూ తాము వాకౌట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

Also Read: హైదరాబాద్ ఇక వరదల నుంచి సేఫా..? ముంపు ముప్పు తొలగిపోయినట్లేనా..?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×