E-Paper
Advertisement

Ponguleti: కేటీఆర్.. నీకు దమ్ముంటే ఆధారాలు చూపించు.. నేను రాజీనామా చేస్తా… లేకపోతే నువ్వు చేస్తావా? : పొంగులేటి

Ponguleti: కేటీఆర్.. నీకు దమ్ముంటే ఆధారాలు చూపించు.. నేను రాజీనామా చేస్తా… లేకపోతే నువ్వు చేస్తావా? : పొంగులేటి
Advertisement

Minister Ponguleti Counter to KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అమృత్ టెండర్లలో ఎటువంటి అవినీతి జరగలేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..’అమృత్ టెండర్లలో అవినీతి జరగలేదు. రూ. వేల కోట్ల కుంభకోణం జరిగిందంటూ కేటీఆర్ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ పై పరువు నష్టం దావా వేస్తాం.

బీఎల్ఆర్, మెగా, గజా కంపెనీలకు ఆనాటి ప్రభుత్వం రూ. 3,516 కోట్ల అంచనా టెండర్లు 3.99 శాతం ఎక్కువకు 2022-23లో ఒప్పందం చేసుకుంది. ఆ మూడు టెండర్లు ఎక్సెస్ ఉన్నాయని మేం గుర్తించాం. నిబంధనలకు తగినట్టుగా రీకాల్ చేయాలని సీఎం ఆదేశించారు’ అంటూ మంత్రి పొంగులేటి అన్నారు.

Advertisement

Also Read: ఆ మీటింగ్ తరువాత అన్ని బయటపడుతాయ్.. తొందరెందుకు? : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

‘కేటీఆర్ కు నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా.. మేం పిలిచిన టెండర్ల విలువ రూ. 8,888 కోట్లు కాదు. ఒకవేళ రూ. 8,888 కోట్లయితే, నేను రాజీనామా చేస్తా. ఆ టెండర్లు రూ. 3516 కోట్లు మాత్రమే అయితే.. నువ్వు రాజీనామా చేస్తావా కేటీఆర్? మీ ఎమ్మెల్యేలంతా కాదు.. మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారా? శోధ కంపెనీకి చెందిన సుజన్ రెడ్డి, నాపై పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి అల్లుడు. బీఆర్ఎస్ హయాంలో సుజన్ రెడ్డికి పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో పనులిచ్చారు. ట్యాక్సులతో కలుపుకుని టెండర్ల విలువ రూ. 8,888 కోట్లున్నా నేను రాజీనామా చేస్తా. లేదంటే.. కేటీఆర్ రాజీనామా చేయాలి. ట్విట్టర్ లో షో చేస్తే కాదు కేటీఆర్.. విమర్శ చేయడానికి ముందు కనీస ఆధారాలు చూపండి. నా ఛాలెంజ్ ను స్వీకరిస్తే రేపు ఉదయం ఏ సమయానికి రావాలో వస్తా. మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపండి. మీరు చెప్పింది నిజమైతే కరెక్ట్ ఫార్మాట్ లో నేను రాజీనామా చేస్తా. మీరు చెప్పింది తప్పయితే.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేయాలి.

Advertisement

ఒక్క రూపాయి కూడా అంచనాలు పెంచకుండా పాత రేట్లకే టెండర్ పిలిచాం. కొత్తగా టెండర్ దక్కించుకున్న ఓ కంపెనీ సుజన్ రెడ్డిదే.. కాకపోతే, ఆయన నా మీద పోటీ చేసిన ఉపేందర్ రెడ్డికి స్వయనా అల్లుడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు – రంగారెడ్డిలో ప్యాకేజీ -7లో రూ. 2300 కోట్ల విలువైన టన్నెల్ వర్క్ లో రూ. 1100 కోట్లు విలువ చేసే వర్క్ ను ఆయన కంపెనీకి కట్టబెట్టారు. ప్రస్తుత మూడు టెండర్ల విలువ రూ. 3687 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం పిలిచిన టెంజర్ల కంటే తక్కువకే మా హయాంలో కన్ఫామ్ అయ్యాయి. విమర్శ చేయొచ్చు.. కానీ, అందులో పస ఉండాలి’ అంటూ కేటీఆర్ కు పొంగులేటి సవాల్ విసిరారు. చూడాలి మరి.. మంత్రి సవాల్ పై కేటీఆర్ స్పందిస్తారా లేదా అనేది.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఇది ఎలా ఇచ్చారు?: కేటీఆర్

Related News

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×