BigTV English

Makeup Tips: సింపుల్‌గా ఇలా మేకప్ వేసుకుంటే.. పార్లర్‌కి వెళ్లకుండానే మెరిసిపోతారు.

Makeup Tips: సింపుల్‌గా ఇలా మేకప్ వేసుకుంటే.. పార్లర్‌కి వెళ్లకుండానే మెరిసిపోతారు.

Makeup Tips: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారు ప్రతి రోజు మేకప్ వేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మరి కొందరు ఫంక్షన్స్, పండగల సమయంలో మేకప్ వేస్తుంటారు. కానీ చాలా మందికి మేకప్ వేసుకోవడానికి ఇష్టం ఉన్నప్పటికీ ఎలా వేసుకోవాలో అంతగా ఐడియా ఉండదు.


ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సింపుల్‌గా మేకప్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే సింపుల్ గా అందంగా ఎలా రెడీ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఫేస్ క్లీనింగ్:
మేకప్ చేసుకోవడానికి ముందుగా ఫేస్ క్లీనింగ్ అనేది చాలా ముఖ్యం. ముఖంలో మెరుపు రావాలంటే మేకప్ వేసుకోవడానికి రెండు గంటల ముందు అలోవెరా జెల్ రాసుకోవాలి. ఆ తర్వాత మీరు మేకప్ వేసుకుంటే, మీ మేకప్‌ చాలా గ్లోగా కనిపిస్తుంది. అలోవెరా జెల్ అప్లై చేసుకున్న 10 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని ఫేస్ వాష్‌తో కడుక్కోండి. ఆపై ముఖానికి మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇది ముఖ చర్మానికి తేమను అందిస్తుంది. ఈ విధంగా మీ ముఖం మేకప్ కోసం సిద్ధంగా ఉండండి.


2. ప్రైమర్ :
ఏ రకమైన మేకప్ అయినా వేసుకునే ముందు, మాయిశ్చరైజేషన్,ఆ తర్వాత ప్రైమర్ అప్లై చేయడం చాలా ముఖ్యం. ఈ రెండు అప్లై చేయడం వల్ల ముఖంపై బేస్ సిద్ధంగా ఉంటుంది. ఇవి అప్లై చేయడం వల్ల వల్ల మీ మేకప్ ఎక్కువసేపు ఉంటుంది. ప్రైమర్‌ను అప్లై చేయడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏటంటే, ముఖంపై ఉన్న మొటిమలు , మచ్చలు చాలా వరకు కనిపించకుండా ఉంటాయి.

3. ఫౌండేషన్ :

ప్రైమర్‌ను అప్లై చేసిన తర్వాత, ఫౌండేషన్‌ను అప్లై చేయండి. దీని కోసం, ఫౌండేషన్‌లో కొంత ఫేస్ క్రీమ్ మిక్స్ చేయండి. తద్వారా ఫౌండేషన్ బాగా మిక్స్ అవుతుంది. అప్పుడు మొత్తం ముఖంపై దీనిని అప్లై చేయండి. ఫౌండేషన్ ఎల్లప్పుడూ మీ చర్మం కంటే తేలికగా ఉండాలి. మీ ముఖంపై ఎక్కువ ఫౌండేషన్ రాసుకోకూడదని గుర్తుంచుకోండి.

4. బ్లషర్, హైలైటర్ :
ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత, బ్లషర్ ఉపయోగించండి. దీన్ని ఉపయోగించేటప్పుడు ఇందులో చాలా లేత రంగులు ఉపయోగించాలని గుర్తుంచుకోండి. లైట్ మేకప్ కోసం పీచ్ , పింక్ కలర్ బ్లషర్స్ వంటివి వాడితే చాలా బాగుంటుంది. మీరు ఏ రంగును ఎంచుకున్నా సరే అది మీ బుగ్గలపై ఎక్కువగా అప్లై చేయకూడదని గుర్తుంచుకోండి. ఒక వేళ మీరు హైలైటర్‌ను ఉపయోగించాలని అనుకుంటే మంచి కలర్ అప్లై చేయండి. ఇది మీ లుక్ సహజంగా కనిపించేలా చేస్తుంది.

Also Read: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

5. కాజల్, ఐలైనర్ :
ఫేస్ మేకప్ తర్వాత, మీరు ఐ మేకప్ చేసినప్పుడు, అత్యంత ముఖ్యమైంది కాజల్.. ఎందుకంటే అది లేకుండా కళ్ళు నిస్తేజంగా కనిపిస్తాయి. ఇందుకోసం మీరు బ్రాండెడ్ కంపెనీ కాజల్‌ని మాత్రమే ఉపయోగించండి. ఆ తర్వాత ఐలైనర్ ను కూడా అప్లై చేయండి. దీంతో మీ మేకప్ పూర్తవుతుంది.

6. లిప్‌స్టిక్:
మేకప్‌లో లిప్‌స్టిక్‌కు అత్యంత ఆకర్షణ ఉంటుంది. మీరు మీ ఎంపిక ప్రకారం లిప్‌స్టిక్‌ను ఎంచుకోండి. ఎందుకంటే మీ స్కిన్ టోన్ ప్రకారం మీకు ఏ రంగు లిప్‌స్టిక్ సరిపోతుందో మీకు తెలుస్తుంది. నేచురల్ లుక్ కావాలంటే మరీ బ్రైట్ షేడ్ కాకుండా లైట్ కలర్ లిప్ స్టిక్ మాత్రమే ఉపయోగించండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×