E-Paper
Advertisement

రూ.2కే ఎయిర్ పోర్ట్‌లో ఫ్రీ ఫుడ్, ఏసీ లౌంజ్ యాక్సెస్.. జస్ట్, ఇలా చేస్తే చాలు

రూ.2కే ఎయిర్ పోర్ట్‌లో ఫ్రీ ఫుడ్, ఏసీ లౌంజ్ యాక్సెస్.. జస్ట్, ఇలా చేస్తే చాలు
Advertisement

Lounge Access: సాధారణంగా ఎయిర్‌పోర్ట్‌లో విమానం కోసం ఎదురుచూడటం అంటే చాలా విసుగుతో కూడిన పని. ఎక్కడ చూసినా రద్దీ, కూర్చోవడానికి సరైన సీటు దొరకదు, పైగా అక్కడ వాటర్ బాటిల్ నుండి ఫుడ్ వరకు అన్నీ ఆకాశాన్నంటే ధరలే ఉంటాయి. ఇలాంటి సమయంలో ‘లౌంజ్’ అనేది ఒక అద్భుతమైన వరం. అక్కడ ప్రశాంతమైన వాతావరణం, మెత్తని సోఫాలు, హై-స్పీడ్ వైఫైతో పాటు మీకు నచ్చిన బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ వంటివి అన్‌లిమిటెడ్‌గా ఎంజాయ్ చేయవచ్చు. చాలామంది ఇది కేవలం సెలబ్రిటీలకో లేదా ధనవంతులకో అనుకుంటారు. కానీ, మీ దగ్గర ఉన్న క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో ఇది అందరికీ సాధ్యమే.

ఇలా చెక్ చేయండి!

Advertisement

మీ కార్డుపై ఈ సౌకర్యం ఉందో లేదో తెలుసుకోవడం చాలా సులభం. మీ కార్డు పైన Visa Platinum/Signature/Infinite, Mastercard World లేదా RuPay Platinum/Select అని రాసి ఉంటే, మీకు లౌంజ్ యాక్సెస్ ఉండే అవకాశం 90% ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి (HDFC), ఎస్‌బిఐ (SBI), ఐసిఐసిఐ (ICICI) వంటి బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ సదుపాయాన్ని ఎక్కువగా కల్పిస్తున్నాయి. కొన్ని కార్డులు కేవలం దేశీయ ప్రయాణాలకే (Domestic) పరిమితమైతే, మరికొన్ని విదేశీ ప్రయాణాల్లోనూ (International) పనిచేస్తాయి.

లౌంజ్ ఎంట్రీ ప్రాసెస్

Advertisement

లౌంజ్‌లోకి వెళ్లినప్పుడు అక్కడ కౌంటర్ దగ్గర మీ కార్డును ఇస్తే.. వారు దాన్ని స్వైప్ చేసి కేవలం రెండు రూపాయలు మాత్రమే కట్ చేసుకుంటారు. ఇది కేవలం మీ కార్డు పనిచేస్తుందో లేదో చూడటానికే. ఆ తర్వాత మీరు లోపలికి వెళ్లి అక్కడ ఉన్న బఫేను మనసారా ఆస్వాదించవచ్చు. అయితే, ప్రతి కార్డుకు ఒక లిమిట్ ఉంటుంది. మూడు నెలలకు రెండు సార్లు లేదా ఏడాదికి నాలుగు సార్లు మాత్రమే ఫ్రీగా వెళ్లే అవకాశం ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో కొన్ని బ్యాంకులు నెలకు కనీసం కొంత మొత్తం కార్డుతో ఖర్చు చేస్తేనే ఈ ఆఫర్ ఇస్తామని నిబంధనలు పెడుతున్నాయి.

ట్రావెల్ ముందు చిన్న చెక్

చివరిగా ఒక చిన్న సలహా, మీరు ప్రయాణానికి ఒక రోజు ముందే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి లేదా వారి వెబ్‌సైట్‌లో మీ కార్డుకు లౌంజ్ యాక్సెస్ ఉందో లేదో చెక్ చేసుకోండి. దీనివల్ల ఎయిర్‌పోర్ట్‌లో ఇబ్బంది పడకుండా హాయిగా మీ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ సారి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నప్పుడు మీ వాలెట్‌లోని కార్డులను వాడటం మాత్రం మర్చిపోకండి!

Also Read: ఇన్‌కాగ్నిటో మోడ్‌లో చీప్‌గా ఫ్లైట్ టికెట్లు.. జస్ట్ ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×