E-Paper
Advertisement

బట్టతల బాధితులు ఈ దేశంలోనే ఎక్కువ.. మరి ఇండియా ఏ ప్లేసులో ఉంది?

బట్టతల బాధితులు ఈ దేశంలోనే ఎక్కువ.. మరి ఇండియా ఏ ప్లేసులో ఉంది?
Advertisement

Baldness Around the World: ప్రపంచ వ్యాప్తంగా బట్టతల అనేది చాలా వేగంగా విస్తరిస్తోంది. గత దశాబ్ద కాలంగా ఈ సమస్య మరింత పెరిగినట్లు తాజా అధ్యయనం లో వెల్లడైంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో బట్టతల సమస్య ఏ స్థాయిలో ఉంది అనే అంశంపై చేసిన ఈ స్టడీలో ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం ఏద్దాం..

ఈ దేశంలోనే ఎక్కువ మంది బట్టతల బాధితులు

తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుతం స్పెయిన్ దేశం బట్టతల సమస్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అక్కడి పురుషుల్లో సుమారు 44.5 శాతం మందికి జుట్టు రాలడం సమస్య కనిపిస్తోంది. అదే విధంగా, యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్ అమెరికాలో కూడా ఈ సమస్య అధికంగానే ఉంది. అక్కడ సుమారు 42.6 శాతం మంది పురుషులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

47 దేశాల్లో అధ్యయనం

Advertisement

మొత్తం 47 దేశాలను పరిశీలించి రూపొందించిన ఈ ర్యాంకింగ్‌ లో, పాశ్చాత్య దేశాల్లో జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉందని స్పష్టమైంది. అయితే, అన్ని దేశాల్లో పరిస్థితి ఒకేలా లేదని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. ఉదాహరణకు, ఇండోనేషియాలో ఈ సమస్య తక్కువ స్థాయిలో ఉంది. అక్కడ కేవలం 26.9 శాతం మంది పురుషులకు మాత్రమే జుట్టు రాలడం సమస్య ఉంది. ఈ సంఖ్యలు దేశాల మధ్య ఉన్న స్పష్టమైన తేడాలను తెలియజేస్తున్నాయి.

బట్టతల సమస్య వెనుక కారణాలు

బట్టతల రావడం వెనుకు కారణాలను కూడా ఈ అధ్యయనం ప్రస్తావించింది. లైఫ్ స్టైల్, జెనెటిక్స్ లక్షణాలు, ఆహారపు అలవాట్లు లాంటి కారణాల వల్ల ఈ తేడాలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక భారత్‌ లో పరిస్థితి మధ్యస్థంగా ఉంది. అంటే, ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఈ సమస్య కొంత తక్కువగానే ఉంది. ఈ వ్యత్యాసానికి అనేక కారణాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం, వ్యక్తిగత సంరక్షణ విధానాలు కూడా ఈ సమస్యను  ప్రభావితం చేస్తున్నాయని వెల్లడించారు. ప్రతి దేశంలో ప్రజల జీవన విధానం వేర్వేరుగా ఉండటం వల్ల, ఈ సమస్య తీవ్రత కూడా మారుతూ ఉందన్నారు.

జుట్టు రాలడం వ్యక్తిగత సమస్యగా భావించినా..

Advertisement

జుట్టు రాలడం అనేది చాలా మంది వ్యక్తిగత సమస్యగా భావిస్తారు. కానీ, తాజా గణాంకాలను చూస్తే, ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సమాజ స్థాయిలో కూడా కనిపించే ఒక సాధారణ ధోరణిగా తెలుస్తోంది. చాలా మంది ఈ విషయాన్ని గమనించరు. కానీ, వివిధ దేశాల మధ్య గణాంకాలను పోల్చినప్పుడు మాత్రమే ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. బట్టతల సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పటికీ, అది ప్రతి దేశంలో ఒకే విధంగా ఉండదు. కొన్ని దేశాల్లో ఇది ఎక్కువగా ఉంటే, మరికొన్ని దేశాల్లో తక్కువగా ఉంటుంది. ఇది ఆయా దేశాల్లో ప్రజల ఆరోగ్యం, జీవనశైలి, జన్యు లక్షణాల మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. ఈ అంశంపై మరింత అవగాహన పెరగడం ద్వారా, భవిష్యత్తులో మంచి పరిష్కారాలను కనుగొనే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: దేశంలోనే లార్జెస్ట్ లగ్జరీ రిసార్ట్, అమ్మో.. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?

Related News

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

35 ఏళ్ల క్రితం ల్యాండ్ అయింది.. ఇప్పటికీ కదల్లేదు! ఈ విమానం వింత కథేంటో తెలుసా?

దక్షిణ అయోధ్యకు ఇక ఫాస్ట్ జర్నీ.. భద్రాచలానికి నేరుగా హైస్పీడ్ రైలు!

Big Stories

Advertisement
×