E-Paper
Advertisement

కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు.. ఈనెల 20న సీఎంతో కలిసి సందర్శన, ఆ విధంగా ముందుకు

కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులు.. ఈనెల 20న సీఎంతో కలిసి సందర్శన, ఆ విధంగా ముందుకు
Advertisement

Minister Uttam Kumar Reddy: గోదావరి నదికి వరదలు వచ్చేలోపు సాయిల్ టెస్టింగ్‌, డిజైన్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మేడిగడ్డ బ్యారేజ్‌‌ను పరిశీలిస్తామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తుల పనులు వేగవంతం.. NDSA ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తుల పనులు వేగవంతం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఢిల్లీలో రెండు రోజులుగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి విషయాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు విషయాలపై చర్చించారు.

శుక్రవారం తెలంగాణ భవన్‌లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ-NDSA ఛైర్మన్ అనిల్ జైన్, సీడబ్ల్యూసీకి చెందిన పీఆర్ఎస్ సంస్థ డైరెక్టర్‌తో చర్చించారు. కాలేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు, పునరుద్ధరణ‌పై ప్రధానంగా చర్చించారు. అధికారులతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.

Advertisement

ఈనెల 20న సీఎం రేవంత్‌రెడ్డి‌తో ప్రాజెక్టు సందర్శిస్తామన్న మంత్రి

కాలేశ్వరం ప్రాజెక్టు విషయంపై గతం ప్రభుత్వం చేసిన పొరపాటు తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం నిర్మాణం చేశారు, మారి హయాంలో కూలిపోయిందన్నారు. ఇందులో మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవన్నారు. దాదాపు 97 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని వివరించారు.

దీనికి వడ్డీ 10 వేల కోట్లు కడుతున్నామని చెప్పుకొచ్చారు. ప్రజాధనం ఉపయోగించారు కాబట్టి రిపేర్ చేయించి ఎలా ముందుకు వెళ్లాలి అనేదానిపై సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల అనుగుణంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మేడిగడ్డ డ్యామేజ్, సాయిల్ టెస్ట్, డిజైన్ల ఖర్చు కాంట్రాక్ట్ సంస్థలు భరిస్తాయని తేల్చేశారు.

ALSO READ: కిడ్నీ పేషెంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!

ఐఐటీ ముంబై ఆధ్వర్యంలో జాయింట్ వెంచర్‌లో బ్యారేజ్ రిపేర్లు, పునరావాసం విషయాల్లో ఏ విధంగా ముందుకు పోవాలో అనేదానిపై ప్రణాళిక రెడీ చేస్తున్నట్లు తెలిపారు. టెస్టింగ్ విషయంలో సీడబ్ల్యూసీకి చెందిన పీఆర్ఎస్ సంస్థను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. వాళ్ల డైరెక్టర్ చర్చల్లో పాల్గొన్నట్లు వివరించారు. గోదావరికి వరదలు వచ్చేలోపు సోయిల్ టెస్టింగ్, డిజైన్స్ ముందుకు తీసుకోవాలని అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×