E-Paper
Advertisement

Bengaluru New Airport: బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?

Bengaluru New Airport: బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?
Advertisement

టెక్ క్యాపిటల్ గా కొనసాగుతున్న బెంగళూరులో మరో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు రాబోతోంది. ఇప్పటికే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నప్పటీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త విమానాశ్రయాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తోంది కర్నాటక ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన డిప్యూటీ సీఎం డికె శివకుమార్ కీలక ప్రకటన చేశారు. మెరుగైన, విస్తృత కనెక్టివిటీ కోసం మరో ఎయిర్ పోర్ట్ తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. గత నెల నుంచి, ఎయిర్‌ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) బెంగళూరులో రెండవ విమానాశ్రయం కోసం స్థలాలను షార్ట్‌ లిస్ట్ చేస్తోంది. కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం మూడు ప్రదేశాలు పరిశీలనలో ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు.

రెండో ఎయిర్ పోర్టు గురించి శివ కుమార్ ఏమన్నారంటే?

నవంబర్ 18న బెంగళూరు టెక్ సమ్మిట్ లో పాల్గొన్న డికే శివకుమార్.. రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం దక్షిణ బెంగళూరులో ఒక స్థలాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని శివకుమార్ ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కొత్త ఎయిర్ పోర్టు గురించి చర్చ జరిగిందని, అందుకు అనుగుణంగానే గ్రౌండ్ వర్క్ జరుగుతుందన్నారు. కర్ణాటక ప్రభుత్వం మార్చి 2025లో ప్రతిపాదిత విమానాశ్రయం కోసం మూడు ప్రదేశాలను ఖరారు చేసిందన్నారు. “మార్చి 2025 ప్రారంభంలో కొత్త ఎయిర్ పోర్టు గురించి చర్చ వచ్చింది. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు రెండవ విమానాశ్రయం కోసం మూడు ప్రదేశాలను ఖరారు చేసింది. వీటిలో రెండు కగ్గలిపుర, హరోహళ్లి సమీపంలోని కనకపుర రోడ్డు, ఉత్తరాన కునిగల్ రోడ్డులో మరో ప్రాంతం ఉంది” అని శివకుమార్ వివరించారు.

Advertisement

Read Also: పర్యాటకులకు విమానాల్లో ప్రయాణం ఉచితం.. థాయ్‌లాండ్ అదిరిపోయే ఆఫర్!

ప్రాథమిక పనులు ప్రారంభం  

2033 వరకు ప్రస్తుత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 150 కి.మీ లోపల మరో విమానాశ్రయాన్ని నిర్మించడానికి వీలు లేదనే నిబంధన ఉంది. ఇప్పుడు ఆ గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త విమానాశ్రయం కోసం ప్రభుత్వం ప్రాథమిక పనులను ప్రారంభించిందని కర్ణాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమల మంత్రి ఎం.బి. పాటిల్ వెల్లడించారు. ఈ స్థాయి ప్రాజెక్టులు పూర్తి కావడానికి కనీసం ఐదు లేదంటే ఆరు సంవత్సరాలు పడుతుందన్నారు. అప్పటిలోగా కొత్త విమానాశ్రయం సిద్ధంగా ఉండేలా చూసుకోవడానికి పనులు మొదలయ్యాయి.  అయితే, ప్రస్తుతానికి ఈ విమానాశ్రయానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు. బడ్జెట్ ఎంత? కెపాసిటీ ఎంత? పనులు ఎప్పుడు ప్రారంభమై, ఎప్పుడు పూర్తవుతాయి? అనే వివరాలను వెల్లడించలేదు. త్వరలోనే ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఈ వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Read Also: భూమ్మీద కోల్డెస్ట్ రైలు ప్రయాణాలు, విండో ఓపెన్ చేస్తే గడ్డకట్టుకుపోతారండోయ్!

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×