E-Paper
Advertisement

ఇండియాలో టాప్ స్కూబా డైవింగ్ స్పాట్స్.. అడ్వెంచర్ లవర్స్‌ అస్సలు మిస్సవ్వద్దు!

ఇండియాలో టాప్ స్కూబా డైవింగ్ స్పాట్స్.. అడ్వెంచర్ లవర్స్‌ అస్సలు మిస్సవ్వద్దు!
Advertisement

Best Scuba Diving Locations in India: వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు చాలా మంది కొత్త ప్రదేశాలను వెతుకుతుంటారు. కొందరు హిల్ స్టేషన్స్ ఇష్టపడితే, మరికొందరు సముద్ర తీరాలకు వెళ్లాలని భావిస్తారు. అలాగే, అడ్వెంచర్స్ ఇష్టపడేవారికి స్కూబా డైవింగ్ ఓ బెస్ట్ ఎక్స్ పీరియెన్స్. ఇటీవలి కాలంలో భారత్‌ లో కూడా ఈ వాటర్ స్పోర్ట్‌ కు మంచి ఆదరణ పెరుగుతోంది. వేసవిలో సముద్రం సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది. నీటి లోపల కనిపించే దృశ్యం కూడా స్పష్టంగా ఉంటుంది. నీటి ఉష్ణోగ్రత కూడా సౌకర్యంగా ఉండటంతో డైవింగ్ అనుభవం మరింత అద్భుతంగా ఉంటుంది. దేశంలో అనేక తీర ప్రాంతాలు,  దీవుల్లో ట్రెయిన్ అయిన ఇన్‌స్ట్రక్టర్లు గైడెడ్ సెషన్లను అందిస్తున్నారు. కాబట్టి, భద్రతగా ఈ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.

దేశంలో బెస్ట్ స్కూబా డైవింగ్‌ స్పాట్స్

⦿ అండమాన్, నికోబార్: భారత్ లో స్కూబా డైవింగ్‌కు ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో అండమాన్, నికోబార్ దీవులు మొదటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. రంగురంగుల చేపలు, పగడపు దిబ్బలు, సముద్ర తాబేళ్లను దగ్గరగా చూడవచ్చు. ట్రైనింగ్ పొందిన నిపుణుల సమక్షంలో ఇక్కడ స్కూబా డైవింగ్ చెయ్యొచ్చు.

Advertisement

⦿ లక్షద్వీప్: ఇది కూడా మరో అద్భుతమైన గమ్య స్థానం. ఇక్కడి సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీటి అడుగున చాలా క్లియర్ గా కనిపిస్తుంది.  అందువల్ల ప్రశాంతంగా, నిశ్శబ్దంగా డైవింగ్ చేయాలనుకునే వారికి ఇది సరైన ప్రదేశం.

⦿ గోవా: గోవా అంటే చాలా మందికి బీచ్‌లు, నైట్ లైఫ్ గుర్తుకు వస్తాయి. కానీ, ఇక్కడ కూడా స్కూబా డైవింగ్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మొదటిసారి ప్రయత్నించే వారికి ఇక్కడి గైడెడ్ సెషన్‌లు సులభంగా అర్థమయ్యేలా ఉంటాయి. ఓడల శిథిలాలు, చిన్న చేపలు  సహా సముద్ర జీవులను ఇక్కడ చూసే అవకాశం ఉంటుంది.

Advertisement

⦿ కేరళ: కేరళలోని కోవలం కూడా మంచి స్పాట్. ఇక్కడ సముద్ర తీరాలు అందంగా ఉండటంతో పాటు, నీటి అడుగున రాతి నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. విశ్రాంతి, సాహసం రెండింటినీ ఒకేసారి అనుభవించాలనుకునే వారికి ఇది సరైన ప్రదేశం.

⦿ కర్ణాటక: ఈ రాష్ట్రంలోని నేత్రాని దీవి కూడా స్కూబా డైవింగ్‌కు ప్రసిద్ధి చెందుతోంది. అయితే, దీని గురించి చాలా మందికి తెలియదు. అయినప్పటికీ, ఇక్కడ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. సముద్ర జీవాలు కూడా విభిన్నంగా కనిపిస్తాయి. తక్కువ రద్దీతో ప్రశాంతంగా డైవింగ్ చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

స్కూబా డైవింగ్ చేసే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డైవింగ్ చేసే వాళ్లకు భద్రత చాలా ముఖ్యం. ఎప్పుడూ ట్రెయిన్ అయిన ఇన్‌స్ట్రక్టర్ పర్యవేక్షణలోనే నీటిలోకి దిగాలి. స్కూబా డైవింగ్ పరికరాలను ముందుగా చెక్ చేయాలి. నీటిలో నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ప్రశాంతంగా ఉండాలి. సముద్ర జీవులను, పగడపు దిబ్బలను తాకకూడదు. అలాగే డైవింగ్‌కు ముందు సరైన విశ్రాంతి తీసుకోవడం, నీరు తాగడం కూడా అవసరం. మొత్తంగా భారత్ లో ఈ అందమైన ప్రదేశాల్లో ఒకసారైనా సందర్శించాల్సిందే!

Read Also: బట్టతల బాధితులు ఈ దేశంలోనే ఎక్కువ.. మరి ఇండియా ఏ ప్లేసులో ఉంది?

Related News

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

35 ఏళ్ల క్రితం ల్యాండ్ అయింది.. ఇప్పటికీ కదల్లేదు! ఈ విమానం వింత కథేంటో తెలుసా?

దక్షిణ అయోధ్యకు ఇక ఫాస్ట్ జర్నీ.. భద్రాచలానికి నేరుగా హైస్పీడ్ రైలు!

న్యూక్లియర్ రియాక్టర్ వేడితో హైడ్రోజన్ ఉత్పత్తి.. భారత టెక్నాలజీకి ప్రపంచం షాక్!

పాదరక్షలు లేకుండా 32 కి.మీ నడక.. సింహాచల గిరి ప్రదక్షిణ విశిష్టత ఇదే!

Big Stories

Advertisement
×