E-Paper
Advertisement

బీచ్‌లో పిల్లాడిని వదిలేసి.. తల్లిదండ్రుల రీల్స్, ఛీ కొంచెమైనా సిగ్గుందా?

బీచ్‌లో పిల్లాడిని వదిలేసి.. తల్లిదండ్రుల రీల్స్, ఛీ కొంచెమైనా సిగ్గుందా?
Advertisement

Baby Caught in Sea Waves: సోషల్ మీడియా వీడియోల కోసం కొంత మంది ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బీచ్ లో ఓ జంట రీల్స్ చేస్తుండగా, వారి పసికందు అలల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న విజువల్స్ నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నది.

బీచ్‌లో రీల్స్.. ప్రమాదంలో చిన్నారి..

వైరల్ అవుతున్న వీడియోలో ఒక జంట బీచ్ లో నడుస్తూ రీల్ చేస్తున్నారు. ఓ మహిళ ఒక పసికందు చేతులు పట్టుకుని నడుస్తున్నట్లు ఫుటేజీలో ఉంది. అయితే, కొద్దిసేపటి తర్వాత ఆ చిన్నారి చేతుల్లో నుంచి జారి ఇసుకపై పడిపోతుంది. అదే సమయంలో సముద్రం నుంచి వచ్చిన అలల్లో కొట్టుకుపోతుంది. అయినా, ఆ జంట ఆ పసికందును పట్టించుకోకుండా రీల్ షూట్ చేస్తున్నట్లు ఫుటేజీలో కనిపిస్తోంది. ఈ విజువల్స్ చూసిన నెటిజన్లు చిన్నారి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమయానికి స్పందించిన యువకుడు

Advertisement

చిన్నారి అలల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్పందించాడు. అతడు నీటిలోకి వెళ్లి చిన్నారిని బయటకు తీసుకొస్తాడు. అయినప్పటికీ, తల్లి తన చిన్నారని పట్టించుకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే ప్రదేశం, తేదీ, ఆ జంట వివరాలు ఇంకా తెలియరాలేదు.

సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం

ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. చిన్నారుల భద్రత కంటే రీల్స్‌ తీసేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంపై మండిపడుతున్నారు. పిల్లలు బీచ్‌ల లాంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు నిరంతరం వారిని గమనించాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో పంచుకునే కొన్ని క్షణాల వీడియో కోసం చిన్నారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. రీల్ కోసం మళ్లీ ప్రయత్నించవచ్చు. కానీ, చిన్నారి ప్రాణాలకు ప్రమాదం జరిగితే తిరిగి తీసుకురాలేమన్నారు.  వీడియోలు, ఫొటోలు తీసుకోవడం తప్పు కాకపోయినా, వాటి కోసం పిల్లల భద్రతను నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

Advertisement

Read Also: ప్రకృతితో కలిసి ప్రయాణం.. భారత్‌ లో చూడాల్సిన 7 విస్టాడోమ్ రైల్వే రూట్స్ ఇవే!

Tags

Related News

ప్రకృతితో కలిసి ప్రయాణం.. భారత్‌ లో చూడాల్సిన 7 విస్టాడోమ్ రైల్వే రూట్స్ ఇవే!

ప్రయాణికులకు అలర్ట్.. వందే భారత్ సహా పలు రైళ్ల టైమ్ మారింది!

కొడుకు కోసం 24 ఏళ్ల వెతుకులాట.. ఈ తండ్రి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

ఫ్యాన్స్‌ ను వెర్రోళ్లను చేసిన నా అన్వేష్.. మళ్లీ మాట తప్పేశాడుగా!

ఇండియాకు వచ్చేస్తానన్న అన్వేష్.. అదేదో ఆపరేషన్ అన్నావ్ ఏమైంది బ్రో అంటున్న నెటిజన్లు?

వేల కిలోమీటర్ల రైలు ప్రయాణం.. అయినా, వేడివేడి భోజనం ఎలా అందిస్తారు?

రైలు బోగీలపై ఉండే నంబర్లు గమనించారా? వామ్మో.. వాటి వెనుక ఇంత మీనింగ్ ఉందా?

Big Stories

Advertisement
×