E-Paper
Advertisement

Delta Flight fire Broke: టేకాప్ అయిన కాపటికే ఇంజన్‌లో మంటలు.. 300 మంది ప్రయాణికుల్లో టెన్షన్, చివరకు

Delta Flight fire Broke: టేకాప్ అయిన కాపటికే ఇంజన్‌లో మంటలు.. 300 మంది ప్రయాణికుల్లో టెన్షన్, చివరకు
Advertisement

Delta Flight fire Broke: విమాన ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో చెప్పడం కష్టం. ఏ మాత్రం పైలట్ నిర్లక్ష్యం వహించినా అందులో వ్యక్తులు ఈ లోకాన్ని విడిచి పెట్టాల్సిందే. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలో విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో 300 మంది ప్రయాణికుల్లో అలజడి మొదలైంది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

డెల్టా ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ముప్పు

Advertisement

ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో సావోపాలో-అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్ లైన్స్ కి చెందిన A330 ఎయిర్ బస్ టేకాఫ్ అయ్యింది. ఏం జరిగిందో తెలీదుగానీ కాసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. ఇంజన్ రెక్కల్లో మంటలు చెలరేగాయని ఏటీసీ నుంచి పైలట్‌కు అలర్ట్ వచ్చింది.

ఆ సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం విండో నుంచి మంటలు రావడం చూసి షాకై ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వారిని అనుక్షణం వెంటాడింది. వెంటనే యూ-టర్న్ తీసుకున్న పైలట్, సౌపోలో ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఆ సమయంలో ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు.

Advertisement

టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజన్‌లో మంటలు, ఆ సమయంలో 300 మంది ప్రయాణికులు

భారీ ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ కాగానే ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అక్కడే ఉన్న రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది విమానం ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానం నుండి మండుతున్న శిథిలాలు రన్‌వే సమీపంలో పడినట్టు తెలుస్తోంది. అందులోని ప్రయాణికులను బస్సులో టెర్మినల్‌కు తరలించారు.

ఘటన కారణంగా ప్రభావితమైన ప్రయాణికులకు మరొక విమానంలో అట్లాంటాకు తరలించారు. వినియోగదారులు, సిబ్బంది భద్రత మాకు అత్యంత ప్రాధాన్యతమని, జరిగిన జాప్యానికి క్షమాపణలు చెప్పింది సదరు విమాన సంస్థ. ఇంజన్ వైఫల్యానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ALSO READ: రైళ్లలో బెడ్‌షీట్లు, టవల్స్ మాయం.. వామ్మో ఏడాదిలో రైల్వేకు అన్ని కోట్లు నష్టమా?

 

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×