E-Paper
Advertisement

కక్కుర్తి గాళ్లు.. రైళ్లలో బెడ్ షీట్లు, టవల్స్ ఎత్తేస్తున్న ప్రయాణికులు, ఆ డివిజన్‌లోనే అత్యధికం!

కక్కుర్తి గాళ్లు.. రైళ్లలో బెడ్ షీట్లు, టవల్స్ ఎత్తేస్తున్న ప్రయాణికులు, ఆ డివిజన్‌లోనే అత్యధికం!
Advertisement

Linen Theft in Trains: రైళ్లలోని బెడ్ షీట్లు, దిండ్లు, టవల్స్ దొంగతనాలు చేయకూడదని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా, ప్రయాణీకులు పట్టించుకోవడం లేదు. ఏ వస్తువు దొరికితే దాన్ని తీసుకెళ్తున్నారు. ఫలితంగా రైల్వేకు పెద్ద మొత్తంలో నష్టం కలుగుతోంది. కేవలం గత ఏడాది అహ్మదాబాద్ డివిజన్ పరిధిలో నడిచే రైళ్లలో ప్రయాణికులకు అందించే లినెన్ వస్తువులను పెద్ద మొత్తంలో దొంగిలించారు. 2024–25 సంవత్సరంలో సుమారు రూ. 4.21 కోట్ల విలువైన బెడ్‌షీట్లు, టవల్స్, దుప్పట్లు లాంటి వస్తువులు మాయం అయ్యాయి.

ఏ రూట్ లో దొంగతనాలు ఎక్కువ అంటే?

ప్రత్యేకంగా కలుపూర్, సబర్మతి స్టేషన్ల నుంచి బయల్దేరే రైళ్లలోని ఏసీ కోచ్‌ లలో ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు. ప్రయాణికులకు సౌకర్యం కోసం అందించే బెడ్‌ షీట్లు, పిల్లో కవర్లు, దుప్పట్లు, ఫేస్ టవల్స్ లాంటి లినెన్ వస్తువులను కొంతమంది ప్రయాణికులు తమతో తీసుకెళ్తున్నారని అధికారులు వెల్లడించారు.

ఏడాదిలో 31 వేల బెడ్ షీట్లు మాయం

Advertisement

రైల్వే తాజా వివరాల ప్రకారం, 2025లో 31,000కు పైగా బెడ్‌షీట్లు, దాదాపు 22,000 ఫేస్ టవల్స్ మాయమయ్యాయి. ముఖ్యంగా చిన్న సైజ్ లో ఉండే టవల్స్ ఎక్కువగా దొంగతనాలకు గురవుతున్నాయి.  రద్దీగా ఉండే సీజన్లలో ఈ సమస్య మరింత పెరుగుతోంది. ఆ సమయంలో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో,  రైల్లోని వస్తువులను ఈజీగా పట్టుకెళ్తున్నట్లు అధికారులు వివరించారు.

రైల్వేకు భారీగా నష్టం

ఈ దొంగతనాల వల్ల రైల్వే శాఖకు భారీ నష్టం జరుగుతోంది. అదే సమయంలో లినెన్ వస్తువులు అందుబాటులో లేకపోతే, తర్వాతి ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది. అదనంగా, కొత్త లినెన్ కొనుగోలు చేయడం ఈజీ కాదు. టెండర్ ప్రక్రియ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల కొంతకాలం కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.

రైల్వే అధికారుల కఠిన చర్యలు

Advertisement

రైళ్లలో వస్తువుల దొంగతనాలకు సంబంధించిన సమస్యను అరికట్టేందుకు రైల్వే అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులు దిగే ముందు లినెన్ సెట్లను లెక్కించాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అలాగే, మానిటరింగ్ పెంచి, దొంగతనాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దొంగతనాలకు సంబంధించి అహ్మదాబాద్ డివిజన్ సీపీఆర్వో అజయ్ సోలంకి ఆందోళన వ్యక్తం చేశారు. “ఇది చాలా ఆందోళనకరమైన విషయం. ప్రయాణికులు ఉపయోగించే ఈ లినెన్ వస్తువులు ప్రజల ఆస్తి.వీటిని ఉపయోగించిన తర్వాత అక్కడే వదిలివేయాలి. తీసుకెళ్లడం చట్టవిరుద్ధం. రైళ్ల నుంచి ఏదైనా వస్తువును తీసుకెళ్లడం నేరం. దొంగతనం చేస్తే జైలు శిక్షతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రయాణికులు బాధ్యతతో వ్యవహరించాలి” అని సూచించారు.

Read Also: ఆరు జతల రైళ్లకు అదనపు కోచ్‌లు.. సమ్మర్ స్పెషల్స్ కూడా, రైల్వే గుడ్ న్యూస్!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×