E-Paper
Advertisement

ఒక్క ఫోన్ సిగ్నల్.. 200 మంది ప్రాణాలు.. విమానంలో ఫ్లైట్ మోడ్ ఎందుకు కంపల్సరీ?

ఒక్క ఫోన్ సిగ్నల్.. 200 మంది ప్రాణాలు.. విమానంలో ఫ్లైట్ మోడ్ ఎందుకు కంపల్సరీ?
Advertisement

Air Travel: విమాన ప్రయాణం అంటేనే ఒక రకమైన ఎగ్జైట్‌మెంట్. కిటికీ పక్కన సీటు దొరికితే ఆకాశంలో మేఘాలను చూస్తూ ఫోటోలు తీసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ సరిగ్గా విమానం టేకాఫ్ అయ్యే ముందు ఎయిర్ హోస్టెస్ వచ్చి ‘దయచేసి మీ ఫోన్‌లను ఫ్లైట్ మోడ్‌లో ఉంచండి’ అని చెప్పగానే.. చాలామందికి లోపల ఒకటే టెన్షన్. ‘అబ్బా.. ఇప్పుడు ఈ ఫోన్ ఆపేస్తే నా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సంగతేంటి? అసలు ఈ చిన్న ఫోన్ సిగ్నల్ అంత పెద్ద విమానాన్ని పడేస్తుందా?’ అని కొందరు కామెడీగా ఫీల్ అవుతుంటారు. నిజానికి విమానంలో ఫోన్ వాడితే విమానం కూలిపోదు కానీ, లోపల జరిగే అసలు కథ వేరే ఉంది.

ఫ్లైట్ మోడ్ ఎందుకు అవసరం?

Advertisement

మనం ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో పెట్టకపోతే అది నిరంతరం మొబైల్ టవర్ల కోసం వెతుకుతూనే ఉంటుంది. విమానం గంటకు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు, ఫోన్ కింద ఉన్న వేర్వేరు టవర్ల సిగ్నళ్లను అందుకోవడానికి ప్రయత్నిస్తూ అధిక శక్తిని విడుదల చేస్తుంది. ఈ క్రమంలో రేడియో తరంగాలు వెలువడతాయి. మీరు ఎప్పుడైనా స్పీకర్ల పక్కన ఫోన్ పెట్టినప్పుడు ‘టిక్ టిక్’ అని వింత శబ్దాలు రావడం గమనించారా? సరిగ్గా ఇలాంటి శబ్దాలే పైలట్లకు ఇబ్బంది కలిగిస్తాయి.

పైలట్ కమ్యూనికేషన్‌లో అంతరాయం

Advertisement

పైలట్లు విమానాన్ని నడుపుతున్నప్పుడు కింద ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో నిరంతరం మాట్లాడుతుంటారు. విమానం ఎటు వెళ్లాలి, ఎత్తు ఎంత ఉండాలి అనే విషయాలన్నీ హెడ్‌సెట్ ద్వారా వింటుంటారు. ఒకవేళ ప్రయాణికులు ఫోన్లు ఆన్ చేసి ఉంచితే.. ఆ సిగ్నళ్ల వల్ల పైలట్ హెడ్‌సెట్‌లో వింత శబ్దాలు (Interference) వస్తాయి. దీనివల్ల కింద ఉన్న అధికారులు చెప్పే ముఖ్యమైన సూచనలు పైలట్‌కు సరిగ్గా వినిపించవు. ఇది ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో జరిగితే చాలా ప్రమాదకరం.

నా ఒక్క ఫోన్ వల్ల ఏమవుతుంది?

చాలామంది ‘నా ఒక్క ఫోన్ వల్ల ఏమవుతుందిలే’ అనుకుంటారు. కానీ విమానంలో ఉన్న 200 మంది ప్రయాణికులూ అలాగే అనుకుని ఫోన్లు ఆన్ చేస్తే, ఆ సిగ్నల్స్ అన్నీ కలిసి పైలట్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందుకే భద్రత దృష్ట్యా ఫ్లైట్ మోడ్ తప్పనిసరి. అలా అని మీరు ఫోన్ వాడకూడదు అని కాదు.. ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో పెట్టి కూడా మీరు అందులో ఉన్న సినిమాలు చూడొచ్చు, పాటలు వినొచ్చు లేదా వైఫై సదుపాయం ఉంటే ఇంటర్నెట్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి ప్రయాణంలో పైలట్‌కి ‘సౌండ్ పొల్యూషన్’ కలిగించకుండా ఉండడమే మన బాధ్యత!

Also Read:ప్రపంచంతో సంబంధం లేని 4 అద్భుత ప్రదేశాలు.. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవ్!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×