E-Paper
Advertisement

ఏపీలోని ఈ గ్రామంలో ఊరు పేరు అడిగితే ‘పోరా’ అంటారు.. పొరుగూరులో మరీ దారుణం!

ఏపీలోని ఈ గ్రామంలో ఊరు పేరు అడిగితే ‘పోరా’ అంటారు.. పొరుగూరులో మరీ దారుణం!
Advertisement

Funny Sounding Village Names in AP: పల్లెలు, గూడేలు, గ్రామాలు ప్రతిదానికి ఓ పేరు ఉంటుంది. ఒక్కో పేరు వెనుక ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే, వాటిలో కొన్ని పేర్లు విచిత్రంగా ఉంటాయి. ఏపీలో ఉన్న అలాంటి కొన్ని గ్రామాల పేర్లు వినగానే కొంతమందికి ఆశ్చర్యం కలుగుతుంది. మరికొందరికి నవ్వు తెప్పిస్తాయి. అలాంటి కొన్ని గ్రామాల పేర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఏపీలో చిత్రమైన పేర్లున్న గ్రామాలు

రీసెంట్ గా ట్రావెల్ విత్ హనీ అనే ట్రావెలర్ ఓ వీడియోను షేర్ చేశారు. ఆయన వెళ్లిన ఊరిపేరు ‘పోరా’.  ఈ గ్రామం   శ్రీకాకుళం జిల్లా పరిసరాల్లో కనిపిస్తుంది. కొత్త వాళ్లు ఎవరైనా ఈ ఊరికి వచ్చి పేరు అడిగితే.. ఎదుటి వారి నుంచి వచ్చే సమాధానం విని ఆశ్చర్యపోక తప్పదు. కానీ, వాస్తవానికి ఈ పేర్లకు స్థానిక చరిత్ర, భాష, సంస్కృతికి సంబంధించిన ప్రత్యేక అర్థాలు ఉన్నాయి. కాలక్రమేణా ఉచ్చారణ మార్పులు, స్థానిక భాషా ప్రభావం వల్ల ఇవి ఇలా మారిపోయాయి.

‘పోరా’ ఊరు పక్కనే ‘పూ*కా’

Advertisement

‘పోరా’ అనే ఊరు పక్కనే మరో షాకింగ్ ఊరు ఉంది. దాని పేరు ‘పూ*కా’. ఈ గ్రామం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఉంది. ఈ పేర్లు మొదట్లో బూతు అర్థంతో సంబంధం లేకుండా ఉండేవి.  కొన్ని పదాలు పాత తెలుగు, ఒడియా భాషల నుంచి వచ్చి ఉండొచ్చు. కాలక్రమంలో వాటి అర్థం మారిపోయి, ఇప్పుడు మనకు వింతగా, బూతుగా అనిపించేలా మారాయి.

ఆంధ్రాలో బోలెడు విచిత్రమైన ఊరి పేర్లు

Advertisement

ఇలాంటి విచిత్రమైన పేర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చాలా ఉన్నాయి. ‘శృంగారపాడు’, ‘కందికుప్ప’, ‘కోట బొమ్మాళి’, ‘కలకుర్రు’,‘చింతలపూడి’, ‘కోటపల్లి’, ‘గూడెం’, ‘ముత్యాలపాడు’ లాంటి  పేర్లు సాధారణంగా కనిపిస్తాయి. కానీ, కొన్నింటి పేర్లు వినగానే నవ్వు వచ్చేలా ఉంటాయి. ‘పందిరిపాడు’,  ‘బండపల్లి’, ‘గొర్రెలపల్లి’, ‘దోమలపెంట’, ‘ఈగలపెంట’ లాంటి గ్రామాల పేర్లు కూడా వినడానికి కొంచెం వింతగా ఉంటాయి.

ఇంకా కొన్ని గ్రామాల పేర్లు అక్కడి వృత్తులు, ప్రకృతి ఆధారంగా ఏర్పడ్డాయి. ‘మామిడిపల్లి’ అంటే మామిడి చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతం, ‘చెరుకుపల్లి’ అంటే చెరకు సాగు ఎక్కువగా జరిగే గ్రామం. అలాగే ‘వంకాయలపాడు’, ‘మిరపకాయలపల్లి’  లాంటి పేర్లు కూడా అక్కడి వ్యవసాయానికి సంబంధించినవే. కొన్ని గ్రామాల పేర్లు స్థానిక దేవతలు, పురాణ కథల ఆధారంగా ఏర్పడ్డాయి. మరికొన్ని పేర్లు అక్కడి భౌగోళిక పరిస్థితులను సూచిస్తాయి. ‘కొండపల్లి’, ‘గుట్టపాడు’ లాంటి పేర్లు కొండలు, గుట్టల దగ్గర ఉన్న ప్రాంతాలను సూచిస్తాయి.

మొత్తంగా ఈ  గ్రామాల పేర్లు కేవలం వినడానికి వింతగా అనిపించినా, వాటి వెనుక ఉన్న కథలు, అర్థాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మనం వాటిని సరదాగా చూసే ముందు, వాటి మూలం ఏమిటో తెలుసుకుంటే ఆ ప్రాంత సంస్కృతి, చరిత్ర గురించి మంచి అవగాహన వస్తుంది. అందుకే ఈ పేర్లు ప్రత్యేకమైన గుర్తింపుగా నిలుస్తున్నాయి.

Related News

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

Big Stories

Advertisement
×