E-Paper
Advertisement

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?
Advertisement

Hotels- Check in vs Check out: యాత్రలు, టూరిస్టు ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటళ్లు బుక్ చేస్తుంటారు. చెక్ ఇన్ ఎప్పుడు, చెక్ అవుట్ ఎప్పుడని బుక్ చేసినప్పుడు అడుగుతారు. ఎందుకు అలా అడుగుతారు? ముందుగా చెక్ ఇన్ చేయడానికి అదనపు రుసుము అడుగుతారు. చెక్-ఇన్, చెక్-అవుట్ సమయాలు ఎందుకు స్థిరంగా ఉంటాయి. దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

హోటళ్లలో చెక్ ఇన్-టూరిస్టు ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటళ్లు చాలామంది బుక్ చేస్తుంటారు పర్యాటకులు. చెక్-ఇన్ సమయం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఉంటుంది. చెక్-అవుట్ ఉదయం 10 నుండి 12 గంటల లోపు ఉంటుంది. ఒక వేళ ఉదయం వేళ హోటల్‌లో ముందుగా దిగితే  ఒక్కోసారి అదనపు రుసుము డిమాండ్ చేస్తుంటారు. దీని వెనుక ఉన్న అసలు కారణం వినియోగదారుల సౌకర్యమే. ఈ హోటల్ నియమం వెనుక నిర్వహణ, లాజిస్టికల్ వంటి కారణాలున్నాయి.

Advertisement

హోటల్‌లో చెక్ అవుట్ -హోటల్‌లో చెక్-అవుట్.. చెక్-ఇన్ మధ్య మూడు లేదా నాలుగు గంటల వ్యవధి ఉంటుంది. దాన్ని హౌస్‌ కీపింగ్ విండో అంటారు. ఒక అతిథి ఖాళీ చేసిన గదిని,  వెంటనే మరొక అతిథికి కేటాయించరు. ఎందుకంటే గదిని శుభ్ర పరిచడం తొలి పాయింట్. అవసరమైన వస్తువులను తిరిగి అందులో పెడతారు.

ఆ సమయాల్లో ఎందుకు?  హోటల్ గదుల శుభ్రత- హౌస్‌ కీపింగ్‌ సులభతరం చేయడానికి  చెక్-ఇన్.. చెక్-అవుట్ సమయాలను ఏర్పాటు చేస్తారు. ఈ సమయంలో పరుపు దుప్పట్లు, దిండు కవర్లు, తువ్వాళ్లు అన్నింటిని మార్చుతారు. గది అంతా శుభ్ర పరుస్తారు. గదిలోని అన్ని సరిగ్గా పని చేస్తున్నాయో లేదో తనిఖీ చేస్తారు. ఈ పనులకు తగినంత సమయం ఉండాలి. అందుకే చెక్-అవుట్.. చెక్-ఇన్ మధ్య విరామం పాటిస్తాయి హోటళ్లు.

Advertisement

టైమింగ్ వెనుక అసలు కారణాలు-నార్మల్‌గా అయితే  ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు హోటళ్లు చాలా రద్దీగా ఉంటాయి. ఈ సమయంలో ఫ్రంట్ డెస్క్ వారు బిల్లులను పరిష్కరించి ఉన్న అతిథులకు వీడ్కోలు పలకాలి. ఒకవేళ చెక్-ఇన్ కూడా ఆ సమయంలో జరిగితే కొత్త అతిథుల  పత్రాలు   తనిఖీ చేయడానికి సమయం పడుతుంది.

ఇప్పటికే ఉన్న అతిథుల బిల్లులను పరిష్కరించడానికి మరి కొంత సమయం తీసుకుంటుంది. దీనివల్ల హోటళ్లు పరిసరాలు రద్దీగా ఉంటాయి. ఏ చిన్న పొరపాట్లు జరిగినా మిగతా కస్టమర్లపై దాని ప్రభావం పడుతుంది. రివ్యూస్‌లో రకరకాల కారణాలు రాస్తుంటారు. ఈ క్రమంలో చెక్-ఇన్‌ను మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్య ఉంటుంది.

ALSO READ: తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

చెక్ అవుట్‌ ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య ఉంటుంది. చాలా హోటళ్లు అందుబాటులో ఉన్న గదుల సంఖ్యను బట్టి  రెగ్యులర్ కస్టమర్లు లేదా లాయల్టీ ప్రోగ్రామ్ సభ్యులకు ఎర్లీ చెక్-ఇన్ లేకుంటే లేట్ చెక్-అవుట్ ఆప్షన్‌లను అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో అదనపు రుసుముతో ఎర్లీ చెక్-ఇన్ సౌకర్యం ఇస్తుంటాయి కొన్ని హోటళ్లు.

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×