E-Paper
Advertisement

IRCTC Ooty Tour Package: ఊటీ – కునూర్‌కు ఐఆర్‌సీటీసీ అదిరే ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌కే అందాల లోకాన్ని చుట్టేసే ఛాన్స్!

IRCTC Ooty Tour Package: ఊటీ – కునూర్‌కు ఐఆర్‌సీటీసీ అదిరే ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌కే అందాల లోకాన్ని చుట్టేసే ఛాన్స్!
Advertisement

IRCTC Ooty–Coonoor Tour Package: తక్కువ ఖర్చులో చక్కటి ప్రర్యాటక ప్రదేశాలను చుట్టేసి రావాలనుకునే వారికి IRCTC సరికొత్త టూర్ ప్లాన్స్ పరిచయం చేస్తుంది. అందులో భాగంగానే ఊటీ- కూనూర్ కోసం సరికొత్త  టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ ధరలో 5 రోజుల టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్రయాణం చెన్నై నుంచి ప్రారంభమై దొడ్డబెట్ట, ముదుమలై అభయారణ్యం, ఊటీ సరస్సు సహా పలు పర్యాటక ప్రదేశాలను కవర్ చేస్తుంది.

IRCTC ఊటీ టూర్ ప్యాకేజీ

తక్కువ ఖర్చుతో వేసవి  సెలవులు కోరుకునే ఎవరైనా IRCTC కొత్త టూర్ ప్యాకేజీని పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఊటీ-కూనూర్ ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో 5-రోజుల ట్రిప్‌ను ఎంజాయ్ చేసే ఛాన్స్ అందిస్తుంది. బడ్జెట్ ధరలో వెళ్లాలనుకునే వారికి ఇది మరింత అనుకూలమైన ప్యాకేజీగా చెప్పుకోవచ్చు.

కూనూర్ ట్రిప్ గురించి..

Advertisement

తాజాగా ప్యాకేజీ ప్రకారం ఈ ట్రిప్ చెన్నై సెంట్రల్ స్టేషన్ నుండి మార్చి 19, 2026 రాత్రి 9:05 గంటలకు ప్రారంభమవుతుంది. రైలు మరుసటి రోజు ఉదయం 6:20 గంటలకు మెట్టుపాళయం చేరుకుంటుంది. అక్కడి నుంచి,  ఓ బస్సులో నేరుగా ఊటీలోని  హోటల్‌కు తీసుకెళుతుంది. అక్కడ ఫ్రెషప్ అయిన తర్వాత, దొడ్డబెట్ట శిఖరం, టీ మ్యూజియం, బొటానికల్ గార్డెన్, ఊటీ సరస్సు లాంటి పాపులర్ పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తారు.

మరుసటి రోజు, పైకారా జలపాతం, ముదుమలై వన్యప్రాణుల అభయారణ్యం లాంటి ప్రదేశాలకు  తీసుకెళ్లారు. ముదుమలై ఎలిఫెంట్ క్యాంప్‌ను కూడా సందర్శిస్తారు. అక్కడ మీరు జంగిల్ సఫారీకి  వెళ్ళవచ్చు. దీని తర్వాత, సిమ్స్ పార్క్, లాంబ్స్ రాక్, డాల్ఫిన్స్ నోస్ చూడటానికి కూనూర్‌ కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు.

Advertisement

Read Also: ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్.. దీని లోపల ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతం అంతే!

టూర్ ముగిసిన తర్వాత.. రోడ్డు మార్గంలో మెట్టుపాళయంకు తిరిగి వెళతారు. అక్కడి నుంచి,  చెన్నైకి తిరిగి రాత్రి 8:20 గంటల రైలుకు అందుకునేలా ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు ఉదయం 6:25 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటారు. అక్కడితో ఊటీ- కూనూర్‌కు యాత్రకు శుభం కార్డు పడుతుంది.

IRCTC ఊటీ టూర్ ప్యాకేజీ ధర

ఈ IRCTC ప్యాకేజీలో మీ రైలు టిక్కెట్లు, హోటల్ బస, లోకల్ ట్రాన్స్ పోర్ట్, బ్రేక్ ఫాస్ట్ ఉంటాయి. అయితే, పర్యాటక ప్రదేశాలలో భోజనం ఖర్చులు, ఎంట్రీ ఫీజులు ప్రయాణీకులు స్వయంగా చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఒక వ్యక్తికి రూ. 22,630, ఇద్దరికి ఒక్కొక్కరికి రూ. 11,830, ముగ్గురికి ఒక్కొక్కరికి రూ. 9,710 ఖర్చవుతుంది. ఒకవేళ మీకూ ఈ టూర్ కు వెళ్లాలని ఆసక్తి ఉంటే IRCTC వెబ్‌ సైట్ లేదంటే మొబైల్ యాప్‌ లో మీ టికెట్ ను బుక్ చేసుకోవచ్చు.

Read Also: పట్టాల మీద పరుగులు తీసే ప్యాలెస్, ఈ రైళ్లో వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

Big Stories

Advertisement
×