E-Paper
Advertisement

IRCTC TDR File: రైలు 3 గంటలు ఆలస్యమైందా? మీ డబ్బులు వాపస్.. IRCTCలో TDR ఫైలింగ్ గురించి తెలుసా?

IRCTC TDR File: రైలు 3 గంటలు ఆలస్యమైందా? మీ డబ్బులు వాపస్..  IRCTCలో TDR ఫైలింగ్ గురించి తెలుసా?
Advertisement

IRCTC TDR File: భారతీయ రైల్వే ప్రతిరోజూ వేల సంఖ్యలో రైళ్లను నడుపుతుంది. లక్షల మందిని తమ గమ్య స్థానాలు చేరవేస్తుంది. అయితే రైలు ప్రయాణాల్లో మీకు ఏదైనా అసౌకర్యం కలిగితే.. మీ టికెట్ డబ్బులను వాపస్ అడగవచ్చు. రైళ్లలో ఏసీ సరిగ్గా పనిచేయకపోయినా, ట్రైన్ 3 గంటలు లేటుగా వచ్చినా, బుక్ చేసుకున్న టికెట్ కు సీటు కేటాయించకపోయినా.. ఇలా పలు కారణాలతో రైల్వే నుండి టికెట్ డబ్బులు వాపసు పొందవచ్చు. ఇందుకు IRCTC TDR ఫీచర్ ఉపయోగపడుతుంది.

IRCTC TDR అంటే ఏమిటి?

TDR అంటే టికెట్ డిపాజిట్ రసీదు. TDR కింద, ప్రయాణికులు తమకు కలిగిన అసౌకర్యానికి రైల్వేశాఖ నుంచి డబ్బులు వాపస్ డిమాండ్ చేయవచ్చు. ఇందుకోసం IRCTC వెబ్‌సైట్ లో రీఫండ్ క్లెయిమ్ చేయవచ్చు.

ఏ సందర్భాల్లో రీఫండ్ అప్లై చేయవచ్చంటే?

Advertisement

మీరు ప్రయాణించాల్సిన రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా, రైలు రద్దు అయినా, రూట్ మారినప్పుడు, ఏసీ పనిచేయనప్పుడు, ప్రయాణికుడికి బుక్ చేసుకున్న దాని కంటే తక్కువ తరగతి సీటు కేటాయించినప్పుడు, రైలు కోచ్ మారినప్పుడు, కూర్చోవడానికి సౌకర్యంగా లేనప్పుడు, రైలు గమ్యస్థానం చేరకముందే ఆగిపోయినప్పుడు, మొదటి రైలు ఆలస్యం కారణంగా ప్రయాణికుడు కనెక్టింగ్ రైలును అందుకోలేనప్పుడు, టీటీఈ అదనపు ఛార్జీ వసూలు చేసినప్పుడు టీడీఆర్ ఫైల్ చేయవచ్చు.

ఎప్పుడు ఫైల్ చేయాలి?

రైలు 3 గంటలు ఆలస్యం అయితే ఆ ట్రైన్ బయలు దేరకముందే టీడీఆర్ ఫైల్ చేయాలి. ఏసీ ఫెయిల్యూర్ పై ట్రైన్ దిగిన తర్వాత 20 గంటల లోపు అప్లై చేయాలి.

Advertisement

Also read:  ఇక మరింత వేగంగా ఆన్‌ లైన్ టికెట్ బుకింగ్, గుడ్ న్యూస్ చెప్పిన IRCTC!

రీఫండ్ కోసం TDR ఎలా ఫైల్ చేయాలి?

ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్ www.irctc.co.in లోకి వెళ్లాలి. లేదా IRCTC అధికారిక యాప్‌ను కూడా తెరవవచ్చు.
మీ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి.. My Account లోని My Transactions ఆప్షన్ లోకి వెళ్లి File TDR పై క్లిక్ చేయండి.
TDR ఫైల్ చేసే టికెట్ PNRను సెలెక్ట్ చేయండి.
TDR అప్లై చేయడానికి కారణాన్ని ఎంచుకోండి.
ఆ తర్వాత TDR అవసరమయ్యే కస్టమర్ పేరును సెలెక్ట్ చేయండి.
తర్వాత File TDR పై క్లిక్ చేయండి.
చివరిగా సూచనలను చదివి Yes పై క్లిక్ చేయండి.
దీంతో మీ TDR ఫైల్ అవుతుంది.

ప్రయాణికుడు చెప్పిన కారణాలు సరైనవే అయితే టికెట్ డబ్బులను IRCTC వాపసు చేస్తుంది.

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×