E-Paper
Advertisement

Train Ticket Booking: ఇక మరింత వేగంగా ఆన్‌ లైన్ టికెట్ బుకింగ్, గుడ్ న్యూస్ చెప్పిన IRCTC!

Train Ticket Booking: ఇక మరింత వేగంగా ఆన్‌ లైన్ టికెట్ బుకింగ్, గుడ్ న్యూస్ చెప్పిన IRCTC!
Advertisement

Indian Railway:  తత్కాల్ తో పాటు పీక్ అవర్ లో టిక్కెట్లను బుక్ చేసుకోవడం రైల్వే ప్రయాణీకులకు పెద్ద తలనొప్పి. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌ లైన్‌ లో టిక్కెట్లు బుక్ చేసుకోవడంలో ఉన్న ఇబ్బంది నుంచి ప్రయాణీకులకు త్వరలో ఉపశమనం కలిగించబోతోంది. జూన్ నాటికి బుకింగ్ సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను ఇండియన్ రైల్వే అప్‌ గ్రేడ్ చేస్తోంది. జూన్ నాటికి బుకింగ్ సామర్థ్యాన్ని నిమిషానికి 150,000 టిక్కెట్లకు పెంచుతుంది. సర్వర్ డౌన్‌, స్లో బుకింగ్ సమస్యలను పరిష్కరిస్తుంది. కన్ఫార్మ్ టికెట్లను పొందే అవకాశాన్ని పెంచుతుంది. కొత్త వ్యవస్థ పలు భాషలతో పాటు సురక్షితంగా ఉండబోతోంది.

 ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌ మరింత సులభతరం

ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌ను సులభతరం చేయడానికి, భారతీయ రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను అప్‌ గ్రేడ్ పనులు మొదలు పెట్టింది. ఇది టికెట్ బుకింగ్ సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచుతుంది. టిక్కెట్లు, రైలు సంబంధిత సమాచారా ఎంక్వయిరీలను కూడా పెంచుతుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ సామర్థ్యం నిమిషానికి 400,000 ప్రశ్నలు కాగా, ఇకపై 4 మిలియన్లకు పైగా పెరగనున్నాయి. కొత్త వ్యవస్థకు సంబంధించి అప్ గ్రేడ్ మీద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) పై పని చేస్తోందని రైల్వే అధికారులు వెల్లడించారు.

రద్దీ సమయాల్లో తగ్గనున్న టికెట్ బుకింగ్ సమస్యలు

Advertisement

కొత్త PRS సామర్థ్యం పెరిగితే, రద్దీ సమయాల్లో టికెట్ బుకింగ్ సమస్యలను తగ్గిస్తుంది. ఎలాంటి సమస్యలు లేకుండా టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఛార్జీల క్యాలెండర్, సీటు ఎంపిక లాంటి కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుత వ్యవస్థతో పోల్చితే మరింత సురక్షితంగా ఉంటుంది. రిజర్వ్ చేయబడిన టిక్కెట్లలో దాదాపు 89 శాతం ఆన్‌ లైన్‌ లో బుక్ అవుతున్నాయి.  అయితే 11 శాతం మాత్రమే రిజర్వేషన్ కౌంటర్లలో కొనుగోలు చేస్తున్నారు.

Read Also: వందే భారత్ vs అమృత్ భారత్.. రెండు రైళ్ల మధ్య ఇన్ని తేడాలు ఉన్నాయా?

కొత్త వ్యవస్థతో మరింత టైమ్ సేవ్

Advertisement

ఇప్పటి వరకు రైలు టిక్కెట్లు బుక్ చేయడం అనేది ఓ పెద్ద సమస్యగా ఉండేది. ఇకపై ఆ పద్దతి మారనుంది. ఈజీగా టిక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రయాణీకులు త్వరగా కన్ఫార్మ్ టికెట్లు పొందనున్నారు.

Read Also: వందే భారత్ స్లీపర్‌ లో కొత్త బెడ్ షీట్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×