E-Paper
Advertisement

నిస్సాన్ షాక్.. గ్రావైట్ ధరలు భారీగా పెంపు!

నిస్సాన్ షాక్..  గ్రావైట్ ధరలు భారీగా పెంపు!
Advertisement

Nissan Gravite Price Hike Announced: భారత మార్కెట్లో ఇటీవల విడుదలైన నిస్సాన్ గ్రావైట్ MPV ధరలు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 5.65 లక్షల ప్రారంభ ధరతో ఈ వాహనాన్ని కంపెనీ పరిచయం చేసింది. అప్పట్లో ప్రకటించిన ప్రత్యేక ప్రారంభ ధరల గడువు పూర్తి కావడంతో ఇప్పుడు పలు వేరియంట్లపై ధరలను సవరించింది.

ధర ఎంత పెరిగింది అంటే?

కంపెనీ ప్రకటించిన తాజా ధరల ప్రకారం, గ్రావైట్ మోడల్‌ పై గరిష్టంగా రూ. 18,400 వరకు పెంపు అమలులోకి వచ్చింది. ముఖ్యంగా N-Connecta పెట్రోల్ మాన్యువల్, N-Connecta CNG మాన్యువల్ వేరియంట్ల ధరలు ఎక్కువగా పెరిగాయి.  అలాగే Tekna CNG MT, Tekna LE CNG MT, Tekna Petrol MT, Tekna LE Petrol MT వేరియంట్ల ధరలు కూడా పెరిగాయి. ఈ వేరియంట్లపై సుమారు రూ. 17,000 పెంచినట్లు ప్రకటించింది. మరోవైపు N-Connecta Petrol AMT, Tekna Petrol AMT, Tekna LE Petrol AMT వేరియంట్ల ధరలు పెరిగాయి.  గ్రావైట్ Acenta Petrol MT, Acenta CNG MT వేరియంట్ల ధరలు రూ. 9,400 వరకు పెరిగాయి. అదే సమయంలో Visia Petrol MT, Visia CNG MT వేరియంట్లపై రూ. 8,400 మేర ధరలు పెరిగాయి.

ధరల సవరణ తర్వాత గ్రావైట్ రేటు ఎంతంటే?

Advertisement

ధరల సవరణ తర్వాత నిస్సాన్ గ్రావైట్ ప్రస్తుతం రూ. 5.73 లక్షల నుంచి రూ. 8.52 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ధరల్లో అందుబాటులో ఉంది. ఈ MPV, రెనాల్ట్ ట్రైబర్‌ తో ఒకే ప్లాట్‌ ఫారమ్‌ ను పంచుకుంటుంది. తక్కువ ధరలో 7 సీటర్ వెహికల్ కోరుకునే కుటుంబాల కోసం ఇదో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

అందుబాటులోకి కొత్త మోడల్స్

మరోవైపు నిస్సాన్ భారత మార్కెట్లో మరింత సత్తా చాటేందుకు కొత్త మోడళ్లను కూడా సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది చివర్లో ‘టెకాన్’ పేరుతో కొత్త మిడ్ సైజ్ SUVను విడుదల చేసే అవకాశముంది. ఈ SUV టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి రాబోయే మోడళ్లు, రెనాల్ట్ డస్టర్ లాంటి పాపులర్ మోడల్స్ కు గట్టి పోటీ ఇవ్వనుంది.

Advertisement

అంతేకాకుండా, టెకాన్ తర్వాత మూడు వరుసల సీట్లతో కూడిన కొత్త SUVను కూడా నిస్సాన్ భారత మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. దీంతో కంపెనీ MPV, SUV విభాగాల్లో తన మోడల్స్ శ్రేణిని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. గ్రావైట్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఇకపై ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో నిస్సాన్ నుంచి రాబోయే కొత్త SUVలు భారత మార్కెట్లో కంపెనీకి కొత్త అవకాశాలను తీసుకురానున్నాయి.

Read Also: హోండా To BMW.. జూన్‌ లో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న 7 కొత్త కార్లు ఇవే!

Related News

బడ్జెట్‌ లో బెస్ట్ రేంజ్.. రూ.15 లక్షల లోపు టాప్ ఈవీ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 200 కిమీ రేంజ్.. భారత్‌ లో బెస్ట్ EV స్కూటర్లు ఇవే!

2026 బ్రెజ్జా Vs హ్యుందాయ్ వెన్యూ.. ఏ SUV కొనడం బెస్ట్?

రైళ్ల భద్రతకు డిజిటల్ టెక్నాలజీ.. మూడు కొత్త యాప్‌లను ప్రారంభించిన ఇండియన్ రైల్వే!

ఒక్కొక్కటి కాదు.. ఒకేసారి 10 కొత్త మోడల్స్.. హోండా దూకుడు మామూలుగా లేదుగా!

హోండా మాస్టర్ స్ట్రోక్.. భారత్‌ లో తొలి E85 మ్యాక్సీ స్కూటర్ లాంచ్!

రూ.1 లక్షలో హీరో కొత్త EV.. మార్కెట్‌ను షేక్ చేయనున్న విడా!

ఏఐ టెక్నాలజీతో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

Big Stories

Advertisement
×