E-Paper
Advertisement

Hill Station: మనదేశంలోనే అత్యంత ప్రశాంతమైన హిల్ స్టేషన్ ఇది, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Hill Station: మనదేశంలోనే అత్యంత ప్రశాంతమైన హిల్ స్టేషన్ ఇది, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే
Advertisement

నగర జీవితంలోని హడావుడి, ట్రాఫిక్, కాలుష్యం నుంచి ఎటైనా పారిపోవాలనిపిస్తుందా? కనీసం వారం రోజులైనా ప్రశాంతమైన ప్రాంతంలో జీవించాలనుందా? కొంతకాలం దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునే వారికి సరైన గమ్యస్థానం ఏదైనా హిల్ స్టేషన్. అందులోనూ ఢిల్లీకి కేవలం ఐదు గంటల ప్రయాణ దూరంలో ఉన్న లాన్స్ డౌన్ ప్రాంతానికి వెళితే.. ఇంకా హాయిగా అనిపిస్తుంది. పచ్చని అడవులు, కొండలు, చల్లని గాలి, నిశ్శబ్ద వాతావరణం లాన్స్‌డౌన్ ప్రత్యేకత. ఇతర హిల్ స్టేషన్లతో పోలిస్తే ఇక్కడ జనసంచారం తక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఆర్మీ కాంటోన్మెంట్ ప్రాంతం కావడంతో పట్టణం పరిశుభ్రత, క్రమశిక్షణ పరంగా కూడా మంచి పేరు సంపాదించింది.

చుట్టుపక్కల చూడదగ్గ ప్రాంతాలు
లాన్స్‌డౌన్ చిన్న గ్రామమే అయినప్పటికీ అనేక అందమైన టూరిస్ట్ స్పాట్లతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

Advertisement

భుల్లా తాల్ సరస్సు: ఇది ఆర్మీ నిర్వహించే అందమైన కృత్రిమ సరస్సు. సరస్సు చుట్టూ పచ్చని చెట్లు, నిశ్శబ్ద వాతావరణం సందర్శకులకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఇక్కడ బోటింగ్ కూడా చేయవచ్చు. కుటుంబంతో కలిసి గడపడానికి ఇది మంచి ప్రదేశం.

టిప్-ఇన్-టాప్ వ్యూ పాయింట్: లాన్స్‌డౌన్‌లో అత్యంత ప్రసిద్ధ ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడి నుంచి హిమాలయ పర్వతాల అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఈ ప్రదేశం మరింత అందంగా కనిపిస్తుంది.

Advertisement

Also read: Black Coffee: బ్లాక్ కాఫీతో పాటూ ఇవి తిన్నారంటే బరువు త్వరగా తగ్గిపోవచ్చు

సెంట్ మేరీస్ చర్చ్: బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ చర్చి చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది. పాత నిర్మాణ శైలి, ప్రశాంత వాతావరణం సందర్శకులను ఆకట్టుకుంటాయి.

దర్శన్ సింగ్ మ్యూజియం: చరిత్రను పరిచయం చేసే ఈ మ్యూజియం లాన్స్‌డౌన్ ప్రత్యేక ఆకర్షణ. సైనికుల వీరత్వం, పాత ఫోటోలు, ఆయుధాలు ఇక్కడ ప్రదర్శనలో ఉంటాయి.

కాలేశ్వర్ మహాదేవ్ ఆలయం: ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మికత, ప్రశాంతత కలగలిపిన అనుభూతిని ఇస్తుంది. భక్తులతో పాటు పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తుంటారు.

లాన్స్‌డౌన్‌లో ట్రెక్కింగ్, నేచర్ వాకింగ్, పక్షులు, ఫోటోగ్రఫీ వంటి అనేక పనులు చేయవచ్చు. అడవుల మధ్య నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. అలాగే క్యాంపింగ్ కూడా పర్యాటకులకు ఆసక్తికరమైన ఎంపిక. రాత్రివేళల్లో ఇక్కడ నక్షత్రాలను స్పష్టంగా చూడగలం.

ప్రముఖ హిల్ స్టేషన్లలో కనిపించే అధిక రద్దీ, ట్రాఫిక్ ఇక్కడ ఉండదు. అందువల్ల నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి లాన్స్‌డౌన్ సరైన ఎంపిక. పట్టణం చిన్నదైనా ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక స్థలాలు కలిసి పర్యాటకులకు పూర్తి అనుభూతిని అందిస్తాయి. కుటుంబాలు, జంటలు, ప్రకృతి ప్రేమికులు అందరికీ ఇది అనువైన గమ్యం.

ఎలా చేరుకోవాలి?
లాన్స్‌డౌన్‌కు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఢిల్లీ నుంచి కారులో సుమారు ఐదు గంటల్లో చేరవచ్చు. సమీప రైల్వే స్టేషన్ కోట్ద్వార్ కాగా, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో లాన్స్‌డౌన్ చేరుకోవచ్చు. సంవత్సరమంతా సందర్శించవచ్చు కానీ వేసవి, శీతాకాలాల్లో ఈ ప్రదేశం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.

Related News

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

Big Stories

Advertisement
×