E-Paper
Advertisement

Kerala Tourism: దేవభూమి అందాలు.. మున్నార్, వయనాడ్, అలప్పుజ.. సమ్మర్‌లో తప్పక చూడాల్సిందే!

Kerala Tourism: దేవభూమి అందాలు.. మున్నార్, వయనాడ్, అలప్పుజ.. సమ్మర్‌లో తప్పక చూడాల్సిందే!
Advertisement

Kerala Tourism: గాడ్స్ ఓన్ కంట్రీగా పిలిచే రాష్ట్రం కేరళ. సమ్మర్‌లో ఇక్కడున్న టూరిస్ట్ స్పాట్లను చూసేందుకు దేశ వ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడున్న ప్రధాన పర్యాటక కేంద్రాల్లో కొన్ని మున్నార్, వయనాడ్, అలప్పుజ. వీటిలో వేటికవే ప్రత్యేకమైనవి. సందర్శకుల్ని విపరీతంగా ఆకర్షించేవి.

కేరళ టాప్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్రదేశాల్లో ముఖ్యమైనది మున్నార్. ముద్రపుజ, నల్లతన్ని, కుండల పర్వతాలు కలిసే చోట ఈ ప్రదేశం ఉంటుంది. సముద్ర మట్టానికి 1700 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతంలో పశ్చిమ కనుమల అద్భుతమైన దృశ్యాలు మిమ్మల్ని చూపు తిప్పుకోనీయకుండా చేస్తాయి.

Advertisement

మున్నార్ టాప్ స్టేషన్ నుంచి చూస్తే మేఘాలు మన చేతికి తగులుతున్నాయా అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికీ వస్తుంది. ఇక్కడ కన్పించే నీలకురింజి పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. టూప్ స్టేషన్ దగ్గర్లో ఉన్న కురింజిమాల అభయారణ్యం, టాటా వాళ్ల టీ మ్యూజియం ప్రముఖ సందర్శనీయ స్థలాలుగా ఉన్నాయి.

మున్నార్ వెళ్లిన వాళ్లు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం కుండల సరస్సు. మున్నార్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ సరస్సు ఇక్కడికి వచ్చిన వాళ్లలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. ఇక్కడ మరో స్పెషల్ ఏంటంటే రెండు సంవత్సరాలకు ఓసారి కన్పించే చెర్రీలు. వీటిని చూసేందుకు కూడా పర్యాటకులు, స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు.

Advertisement

మట్టుపెట్టి డ్యామ్ మున్నార్‌ అట్రాక్షన్స్‌లో మరొకటి. అనముడి పర్వత శ్రేణుల మధ్యలో మున్నార్‌కు 13 కిలోమీటర్ల దూరంలో ఈ డ్యామ్ ఉంటుంది. పచ్చని పర్వతాల మధ్య అద్భుతమైన ప్రకృతిని మనం ఆస్వాదించవచ్చు. ఇక్కడి బోటింగ్ యమా సరదాగా ఉంటుంది. ఇక, పరిసరాల్లోనే ఉన్న టీ గార్డెన్‌ల ప్రతిబింబాలు ఈ సరస్సులో పడి మరింత స్పెషల్‌గా కన్పిస్తుంటాయి.

మున్నార్‌లో మరో అందమైన ప్రదేశం ఎకో పాయింట్. ఇక్కడి ఉండే ప్రశాంతమైన చల్లటి వాతావరణంలో మీరు మాట్లాడే మాటలు మళ్లీ మీకు తిరిగి వినిపిస్తాయి. మీరు బయటకు పిలిచే పలుకులు లోయంతా మార్మోగుతూ మళ్లీ మీ దగ్గరకు రావడం ఓ మధురమైన అనుభూతనే చెప్పాలి. ఇదే ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది.

కేరళలో ఉన్న మరో బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్ వయనాడ్. ఇక్కడా చాలా ప్రాంతాలు సందర్శించేందుకు ఎప్పుడూ మీకు వెల్‌కమ్ చెబుతుంటాయి. అలాంటి వాటిలో ప్రధానమైనది బాణాసుర సాగర్. అద్భుతమైన ఈ మట్టి ఆనకట్ట దేశంలో అతిపెద్దది.. ఆసియాలో రెండోది. ఇందులోని నీరు చాలా స్పష్టంగా స్పటికం మాదిరిగా కన్పిస్తుంటుంది. ఆ పక్కనే ఉన్న బాణాసుర కొండలు పక్షలు కిలకిలారావాలతో మరింత సుందరంగా కన్పిస్తాయి.

వయనాడ్‌లో మరో సుందరమైన ప్రదేశం పక్షిపథాలం. పక్షి పథాలం అంటే పక్షుల సంపద అని అర్థం. నిట్టనిలువగా కన్పించే కొండలు, నదులు, పచ్చదనం మధ్య కన్పించే పక్షులు మనల్ని ఎక్కడికో తీసుకెళతాయి. ఇక, ఇక్కడ కన్పించే కోలగప్పర పర్వతాలను అధిరోహించే వారికి ఫేవరెట్ స్పాట్. అత్యంత ఎత్తైన చెంబ్రా శిఖరం వయనాడ్‌లోనే ఉంది. ఈ శిఖరం అధిరోహించేందుకు సుమారు 3 గంటల వరకు పడుతుంది. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం వయనాడ్ అంతా ముగ్ధమనోహరంగా కన్పిస్తుంది.

కల్పెట్ట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పూకోడ్ అనే మంచినీటి సరస్సు ఉంది. పశ్చిమ కనుమలు మధ్య ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికుల ఫేవరెట్ డెస్టినేషన్. అయితే.. ఈ మన భారతదేశ పటం ఆకారంలో ఉండడం విశేషమనే చెప్పాలి. దీనికి సమీపంలోనే నీలిమల వ్యూపాయింట్, లక్కిడి వ్యూపాయింట్‌లు వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. లక్కిడి వ్యూ పాయింట్ అయితే వయనాడ్ మొత్తంలోనే అత్యంత ఎత్తైనదిగా చెబుతారు.

కేరళలో మరో సూపర్బ్ టూరిస్ట్ డెస్టినేషన్ అలప్పుజ. హౌస్‌ బోట్‌లు, బీచ్‌లు, బ్యాక్‌ వాటర్‌తో కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని తూర్పు వెనిస్‌గా పిలుస్తుంటారు. అలప్పుజలో టాప్ బ్యూటీ స్పాట్ కుట్టనాడ్‌. దీనినే రైస్‌ బౌల్ ఆఫ్ కేరళ అని పిలుస్తుంటారు. కుట్టనాడ్ చుట్టూ బ్యాక్ వాటర్స్ ఉంటాయి. అంతేకాదు.. భూస్థాయి కంటే పైకి ప్రవహించే లోతట్టు జలమార్గాలు కన్పిస్తాయి. ఇక, అలెప్పీ బోట్‌ హౌస్ టూర్ మీ లైఫ్‌లో మర్చిపోలేనిదిగా మిగులుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Also Read: Rahul Gandhi: ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ..?

అలప్పుజ బీచ్‌ మరో స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడే సముద్రంలోకి విస్తరించి ఉన్న పురాతనమైన పీర్ కన్పిస్తుంది. ఇది 137 ఏళ్ల నాటిదిగా చెబుతారు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు నూటిని నూరు శాతం ఈ బీచ్‌ను చూడకుండా వెళ్లరన్నది ఇక్కడి స్థానికులు చెప్పేమాట. ఇక, థైకల్ బీచ్‌ సైతం మిమ్మల్ని ఎంతో ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా ఉండేలా చూస్తుంది.

Also Read: Prabhas Upcoming Movies: ప్రభాస్ షూటింగ్ షెడ్యూల్స్‌పై క్లారిటీ.. రాబోయే సినిమాలు ఏ వరుసలో విడుదలవుతాయంటే..!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×