E-Paper
Advertisement

Headphones Chemicals: బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్‌లో హానికర కెమికల్స్.. అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు

Headphones Chemicals: బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్‌లో హానికర కెమికల్స్.. అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు
Advertisement

Headphones Chemicals| ఈ రోజుల్లో చాలామంది వీడియోలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి హెడ్‌ఫోన్స్ ఉపయోగిస్తారు. కొందరికి ఇది అలవాటైతే చాలా మందికి ఇది వ్యసనంగా మారింది. పైగా మంచి క్వాలిటీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం బ్రాండెడ్ కంపెనీల హెడ్‌ఫోన్స్ ఇష్టపడతారు. అయితే ఈ బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్‌లో హానికర కెమికల్స్ ఉన్నాయని ఇటీవలే జరిగిన అధ్యయనంలో తేలింది.

ఈ అధ్యయన ఫలితాలు చూసి చాలా మంది కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. ఈ అధ్యయనంలో 81 రకాల హెడ్‌ఫోన్ మోడల్స్‌ పరీక్షించారు. ఈ 81 మోడల్స్‌లో ప్రతి దాంట్లో ప్రమాదకర పదార్థాలు ఉన్నాయి.

బ్రాండ్లు, అధ్యయన వివరాలు

Advertisement

సెంట్రల్ యూరప్‌లోని పలు సివిల్ కంపెనీలు కలిసి ToxFREE LIFE for All అనే ప్రాజెక్ట్ చేశాయి. ఓవర్-ఇయర్, ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్లను కొని పరీక్షించారు. చెవులకు తాకే ప్లాస్టిక్, సింథటిక్ భాగాలపై దృష్టి పెట్టారు. ఎక్కువ సేపు ఉపయోగించే వారికి రసాయనాలు శరీరంలోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బిస్ఫెనాల్స్, ఇతర హానికర కెమికల్స్

హెడ్‌ఫోన్ పరీక్షల్లో బిస్ఫెనాల్ (Bisphenols) రసాయనాలు దాదాపు 98 శాతం శాంపిల్స్‌లో ఉన్నాయి. BPA, బిస్ఫెనాల్ S వంటివి ఎండోక్రైన్ డిస్‌రప్టర్లుగా పరిగణిస్తారు. ఇవి శరీరంలో హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫ్తాలేట్స్ (phthalates), క్లోరినేటెడ్ పారఫిన్స్ (chlorinated paraffins), కొన్ని ఫ్లేమ్ రిటార్డెంట్స్ (flame retardants) కూడా కనిపించాయి. వీటి వల్ల సంతానలేమి సమస్యలు, అవయవాలు దెబ్బతినడం, క్యాన్సర్ వంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉంది.

దీర్ఘకాలిక ఉపయోగంతో ప్రమాదం ఎక్కువ

Advertisement

చాలా సాంపిల్స్‌లో రసాయనాలు తక్కువ మోతాదులో ఉన్నాయి. కానీ రోజూ ఎక్కువ సేపు ఉపయోగిస్తే ప్రమాదం పెరుగుతుంది. పని, వినోదం, ప్రయాణం, వ్యాయామం సమయంలో హెడ్‌ఫోన్లు ధరిస్తారు. వేడి, చెమట వల్ల రసాయనాలు చర్మంలోకి సులభంగా వెళ్తాయి. వేడి వల్ల ప్లాస్టిక్ నుంచి రసాయనాలు విడుదల అవుతాయి. ఇతర ఉత్పత్తుల నుంచి వచ్చే రసాయనాలతో కలిసి ప్రమాదం మరింత పెరుగుతుంది.

పారదర్శకత, నియంత్రణ కోసం డిమాండ్

ఆరోగ్య కార్యకర్తలు ఎలక్ట్రానిక్ కంపెనీల నుంచి పూర్తి పారదర్శకత కోరుతున్నారు. హెడ్‌ఫోన్స్ విక్రయించే కంపెనీలు రసాయనాల వివరాలు స్పష్టంగా చెప్పాలని అంటున్నారు. చర్మానికి తాకే ఉత్పత్తులకు కఠినమైన సేఫ్టీ స్టాండర్డ్స్ అవసరమని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు, టీనేజర్లు హార్మోన్ డిస్‌రప్షన్‌కు త్వరగా గురవుతారు. ప్రభుత్వ రెగ్యులేటర్లు ఎండోక్రైన్ డిస్‌రప్టర్లపై కఠిన నియంత్రణలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్పష్టమైన లేబులింగ్ ఉంటే కస్టమర్లు సరైన నిర్ణయం తీసుకోగలరు.

Also Read: ప్రకృతి నాశనం.. మనుషుల కంటే ఎక్కువ నీరు తాగేస్తున్న ఏఐ టెక్నాలజీ

వినియోగదారుల అవగాహన పెరుగుతోంది

సురక్షితమైన మెటీరియల్స్‌తో తయారైన హెడ్‌ఫోన్స్ ఎంచుకోవాలని ఈ అధ్యయన ఫలితాల ద్వారా తెలుస్తోంది. ప్రసిద్ధ బ్రాండ్లు అయినంత మాత్రాన అవి సురక్షితమైనవి అని గ్యారెంటీ లేదు. హెడ్‌ఫోన్లు పరిమితంగా ఉపయోగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. బ్రేక్‌లలో తీసేయాలి. రెగ్యులర్‌గా హెడ్‌ఫోన్స్ శుభ్రం చేయాలి. సేఫ్టీ సర్టిఫైడ్ ఉత్పత్తులు ఎంచుకోవాలి. దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలపై మరిన్ని అధ్యయనాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

ఏంది భయ్యా ఇది.. జియోలో రూ.350 లోపు.. ఇంత మంచి ప్లాన్స్ ఉన్నాయా!

గూగుల్ డ్రైవ్‌లో ఫైళ్లు వెతకలేక విసుగొస్తుందా? ఈ సూపర్ ట్రిక్స్ వాడితే క్షణాల్లో పని పూర్తి!

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

Big Stories

Advertisement
×