E-Paper
Advertisement

పొరపాటున ఆ గ్లాస్ పగిలితే అంతే.. సముద్ర గర్భంలో అత్యంత ప్రమాదకరమైన హోటల్స్!

పొరపాటున ఆ గ్లాస్ పగిలితే అంతే.. సముద్ర గర్భంలో అత్యంత ప్రమాదకరమైన హోటల్స్!
Advertisement

Underwater Hotels: సాధారణంగా మనం ఇంట్లో చిన్న అక్వేరియం పెట్టుకుని, అందులో చేపలు ఈత కొడుతుంటే చూసి మురిసిపోతుంటాం. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది! కొన్ని హోటల్స్ మనల్ని తీసుకెళ్లి సముద్రం అడుగున ఒక గ్లాస్ రూమ్‌లో పడేస్తున్నాయి. అంటే అక్కడ అక్వేరియంలో ఉన్నది చేపలు కాదు.. మనం అన్నమాట! బయట తిరిగే షార్క్ చేపలు, రంగు రంగుల చిన్న చేపలు మనల్ని వింతగా చూస్తుంటాయి. ‘ఏంటి ఈ మనుషులు ఇక్కడికి కూడా వచ్చేశారు? అని అవి డిస్కస్ చేసుకుంటున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మాల్దీవుల్లో ‘ది మురాకా’ (The Muraka)

Advertisement

మాల్దీవుల గురించి మనందరికీ తెలిసిందే. కానీ అక్కడ ‘మురాకా’ అనే ఒక అద్భుతమైన విల్లా ఉంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 16 అడుగుల లోతులో ఉంటుంది. పైన అంతా గ్లాస్ సీలింగ్! మీరు హాయిగా బెడ్ మీద పడుకుని పైకి చూస్తే.. నీలి రంగు నీళ్లు, అందులో అటు ఇటు తిరిగే సముద్ర జీవులు కనిపిస్తాయి. రాత్రి పూట లైట్లు ఆన్ చేస్తే ఆ వ్యూ చూసి మీరు మైమరిచిపోవడం ఖాయం. కాకపోతే, పొద్దున్నే లేవగానే కిటికీ పక్కన ఏదైనా పెద్ద షార్క్ చేప కనిపిస్తే.. గుండె ఆగినంత పని అవ్వడం గ్యారెంటీ! ఇక్కడ ఒక రాత్రి ఉండడానికి రూ. 15 లక్షల నుండి 40 లక్షల వరకు ఉంటుంది.

దుబాయ్ ‘అట్లాంటిస్ ది పామ్’ (Atlantis, The Palm)

Advertisement

దుబాయ్ అంటేనే లగ్జరీకి కేరాఫ్ అడ్రస్. ఇక్కడి అండర్ వాటర్ సూట్లలో గోడల బదులు భారీ గ్లాస్ ప్యానెల్స్ ఉంటాయి. ఈ కిటికీల అవతల సుమారు 65,000 సముద్ర జీవులు తిరుగుతూ ఉంటాయి. మీరు బ్రష్ చేసుకుంటున్నా లేదా కాఫీ తాగుతున్నా.. పక్కనే ఒక పెద్ద స్టింగ్ రే (తేలు చేప) వచ్చి హాయ్ చెబుతుంది. ఇక్కడ ఉండే సౌకర్యాలు చూస్తే రాజభవనంలా అనిపిస్తాయి, కానీ చుట్టూ మాత్రం నీళ్లే ఉంటాయి.

ఇక్కడ ఉండే మజా ఏంటి?

ఈ హోటల్స్‌లో ఉండే ప్రైవసీ మామూలుగా ఉండదు. చుట్టూ మనుషుల అరుపులు, ట్రాఫిక్ సౌండ్లు అస్సలు వినిపించవు. కేవలం నీటి అలల సప్పుడు, చేపల కదలికలు మాత్రమే! మీరు తినే భోజనం కూడా సముద్రం లోపలే వడ్డిస్తారు. అంటే చేపల కూర తింటూ, కిటికీ అవతల ఉన్న చేపలను చూడటం కొంచెం వింతగా అనిపించినా.. ఆ ఎక్స్ పీరియన్స్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది.

ఇవన్నీ వినడానికి భలే మజాగా ఉన్నాయి కదా! కానీ ఒక చిన్న డౌట్.. పొద్దున్నే నిద్ర లేవగానే జుట్టు చెరిగిపోయి, కళ్లు వాచిపోయి ఉన్న మన ముఖాన్ని చూసి.. కిటికీ అవతల ఉన్న షార్క్ చేపలు భయపడి పారిపోతాయేమో అని! ఒకవేళ పొరపాటున ఆ గ్లాస్ కిటికీకి చిన్న పగులు వచ్చినా.. మనం ఈత నేర్చుకోవాల్సిన అవసరం లేకుండానే సముద్రం మొత్తం చుట్టేయొచ్చు. ఏది ఏమైనా, భూమి మీద బోర్ కొట్టిన వారికి, నీటి అడుగున ఈ ‘అక్వేరియం లైఫ్’ ఒక క్రేజీ అడ్వెంచర్ అనే చెప్పాలి!

Also Read: ఇది విమానమా లేక ఇంద్రలోకమా? లోపల చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Related News

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

Big Stories

Advertisement
×